హైదరాబాద్ ను ఇప్పుడు ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి.  కరెంట్ సమస్య, నీటి సమస్య, డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు ఇలా ఒకటేమిటి అనేకం హైదరాబాద్ ను పట్టి పీడిస్తున్నాయి.  ఈ సమస్యలతో జనాలు సతమతం అవుతున్నారు.  ఇదీ చాలదన్నట్టు ఇప్పుడు మరో కొత్త సమస్య హైదరాబాద్ కు రాబోతున్నది.  ఇది సమస్య కాదు.. మన మంచికే కాకపోతే .. నిబంధనలు పాటించకపోతే జేబులు గుల్ల చేసుకోవాల్సిందే కదా.  


అదేంటని షాక్ అవుతున్నారా అక్కడికే వస్తున్నా.. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలు మినహా చాలా రాష్ట్రాల్లో వాహన కొత్త చట్టం అమలులో ఉన్నది.  బండికి సంబంధించిన కాగితాలన్ని సంక్రంగా ఉండాలి.  లేదంటే ఫైన్ పడుతుంది.  తెలుగు రాష్ట్రాల్లో కొత్త చట్టం అమలు జరగలేదు.  ఇప్పటి వరకు చూసి చూడనట్టుగా వదిలేశారు.  కానీ, ఇకపై అలాకాదు, కొత్త వాహన చట్టం హైదరాబాద్ లో కూడా అమలు కాబోతున్నది. 


వినాయక నిమర్జనం తరువాత ఈ చట్టాన్ని అమలు చేయానికి ప్రభుత్వం రెడీ అవుతున్నది.  రెండు మూడు రోజులు వాహనదారులకు అవగాహనా కల్పించి ఆ తరువాత చట్టాలను అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.  ఇప్పటి వరకు ఫోటోలు తీసి చలానాలకు ఇళ్లకు పంపేవారు.  అలా కాకుండా క్షుణ్ణంగా పరిశీలించి చలానాలు వేసేందుకు పోలీస్ శాఖ రెడీ అవుతున్నది. 


అంతేకాదు, బైక్ వెనక కూర్చున్న వ్యక్తికి కూడా తప్పకుండా హెల్మెట్ ఉండాలనే నిబంధనను తీసుకొస్తోంది.  వినాయక నిమర్జనం తరువాత ఈ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.  చట్టం అమలు చేయడం కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.  సో, ఒకేసారి ఈ చట్టం అమలు జరిగింది అంటే పాపం హైదరాబాద్ లో ఎంతమంది ఇబ్బందులు పడతారో చూడాలి.  రోజుకు ఎన్నిరకాల గొడవలు జరుగుతాయో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: