వినాయక చవితి వచ్చింది అంటే.. ముంబై, హైదరాబాద్ నగరాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. వేలాది విగ్రహాలను ఏర్పాటు చేస్తారు.  మండపాల్లో ధూందాం గా పండుగ చేస్తారు.  తప్పేట్లు తాళాలు.. మోతలు అబ్బో మాములుగా ఉండదు.  ఆ సందడిని చూడటానికి ఎక్కడెక్కడినుంచో వస్తున్నారు.  ముఖ్యంగా ఖైరతాబాద్ గణపతిని చూడటానికి జనాలు తండోపతండాలుగా కదిలి వస్తుంటారు.  తరలిరాదా తానే వసంతం అనే రీతిన జనాలు కదిలి వస్తుంటారు.  


ఇక నిమర్జనం రోజున ఉండే సందడి మరో విధంగా ఉంటుంది.  నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో 30వేలకు పైగా విగ్రహాలను నిమర్జనం చేస్తారు. అక్కడే అత్యంత ఎత్తైన ఖైరతాబాద్ వినాయకుడిని నిమర్జనం చేస్తారు.  దాదాపు 60 ఏళ్లకు పైగా ఇలాంటి ఆచారం వస్తూనే ఉన్నది.  వినాయకుడి చేతిలో తప్పనిసరిగా ఉండేది లడ్డు.  గణపతి లడ్డు చాలా ఫేమస్. ఖైరతాబాద్ లడ్డును నిమర్జనం రోజున అందరికి పంచిపెడతారు.  


అయితే, బాలాపూర్ లో ఉండే బాలాపూర్ గణపతి విషయంలో మాత్రం వేరుగా ఉంటుంది.  బాలాపూర్ గణపతి లడ్డును వేలం వేస్తారు. 1994 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది.  గణపతి లడ్డు వేలంలో బాలాపూర్ లడ్డును దక్కించుకోవడాని ప్రతి ఒక్కరు ఉత్సాహం చూపుతారు.  ఈ వేలంలో వారు వీరు అనే తేడా లేకుండా అందరు పాల్గొంటారు.  


ముస్లిం సోదరులు సైతం బాలాపూర్ లడ్డు వేలంపాటలో పాల్గొంటారు.  ఇక పాతబస్తీలో విజయకుడి విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి.  అక్కడ గణపతి చేతుల్లో ఉండే లడ్డును తయారు చేసింది ఎవరు అంటే పాతబస్తీ బర్కస్ కు చెందిన మహ్మద్ భాయ్ అనే వ్యక్తి ఈ లడ్డును తయారు చేస్తున్నారు.  దాదాపు 20 ఏళ్లుగా అయన గణపతి ఉత్సవం కోసం భారీ లడ్డులను తయారు చేస్తున్నారట.  లాభాపేక్ష లేకుండా తక్కువ ధరకు ఈ లడ్డును తయారుచేసి ఇస్తుంటారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: