స్త్రీలను గౌవరించే దేశంలో భారతదేశం అందరికంటే ముందు ఉంటుంది. స్త్రీలను గౌరవించడం వారికి సముచిత స్థానం ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది.  ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ఈ ఇలా జరుగుతూనే ఉన్నది.  అయితే,  ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.  నిత్యం ఎక్కడో ఒకచోట ఏదోవిధంగా మహిళలపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి.  


ప్రతి గంటకు దేశంలో కనీసం ఒక మహిళపై అఘాయిత్యం జరుగుతున్నట్టు సమాచారం. భారతదేశంపై ఉన్న గౌవరం, నమ్మకం, ఇక్కడి ఆచారవ్యవహారాలపై ఉన్న అభిమానంతో చాలామంది విదేశీయులు ఇండియా వస్తుంటారు.  ఇక్కడ సెటిల్ కావడానికి ఆసక్తి చూపుతుంటారు.  ఇక్కడి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు.  అలా పరిచయాలు పెంచుకోవడం ఒక్కోసారి వారిపాలిట శాపంగా మారుతుంది.  


ఇటీవలే కిర్గిస్థాన్ కు చెందిన ఓ మహిళ ఉత్తరప్రదేశ్ లోని హతరస్ జిల్లాకు చెందిన ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.  ప్రస్తుతం వారు ఉత్తరప్రదేశ్ లో ఉంటున్నారు.  కిర్గిస్థాన్ నుంచి వచ్చిన ఆ యువతి.. భారతదేశ పౌరసత్వం తీసుకోవాలని అనుకుంది.  దీనికోసం పోలీసులను సంప్రదించింది.  ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆమెకు పౌరసత్వం ఇప్పిస్తామని నమ్మించారు.  


ఆ మహిళను లక్నో, మథురలో అత్యాచారం చేశారు. అత్యాచారానికి గురికాబడ్డ మహిళ.. తన భర్త సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.  విదేశీ యువతి కావడంతో వెంటనే పోలీసులు స్పందించారు.  విచారణ ప్రారంభించారు.  క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారి ఉద్యోగాలకు ఎసరు పెట్టింది.  పైగా విదేశీ యువతి కావడంతో వారికీ కఠినమైన శిక్షలు విధించే అవకాశం ఉన్నది.  రక్షించాల్సిన పోలీసులే ఇలా భక్షిస్తుంటే.. ఇక రక్షణ ఎక్కడ ఉంటుంది.  ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి అర్ధం ఎక్కడి నుంచి వస్తుంది.  ఉత్తరప్రదేశ్ లోనే ఇలాంటి ఘోరాలు ఎక్కువగా జారుతుండటం విశేషం.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకుంటే మంచిది. 


మరింత సమాచారం తెలుసుకోండి: