సృష్టికి సంబంధించిన కార్యం అంటే ఇద్దరు వ్యక్తులు తప్పనిసరిగా ఉండాలి.  ఇద్దరిలో ఎవరు లేకున్నా ఆ కార్యక్రమం జరగదు.  తప్పులు అందరు చేస్తుంటారు.  తప్పు చేసిన తరువాత ఆ తప్పు తెలుసుకొని దానికి సొల్యూషన్ కనుక్కోవాలేగాని, తప్పును కప్పిపుచ్చుకోవడానికి పెద్దతప్పు చేసి దోషిగా అందరిముందు నిలబడటం ఏం బాగుంటుంది చెప్పండి.  బాగోదు కదా.  


ఈ విషయంలో ఓ మహిళా చాలా తప్పు పెద్ద తప్పు చేసింది. తాను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను అని చెప్పి చెప్పింది.  అలా చెప్పిన కొన్నాళ్ళకు ఆ భార్య గర్భవతి అయ్యింది.  ఆ విషయం భర్తకు చెప్పలేక పోయింది.  దాస్తే దాగేది కాదుకదా అది.  సొంతంగా నిర్ణయం తీసుకుంది.  గర్భాన్ని చంపేసుకోవాలని అనుకుంది.  తెలిసిన మేరకు అన్నిరకాలుగా ప్రయత్నం చేసింది.  


గర్భం పోగొట్టుకువడానికి నాటు వైద్యం చేసుకోవడంతో.. కడుపులోని బిడ్డకు అంగవైకల్యం వచ్చింది.  చివరకు చేసేది లేక భర్తకు జరిగిన విషయం చెప్పింది.  భర్త కోపగించుకున్నాడు.  తప్పు జరిగింది కాబట్టి హాస్పిటల్ కు వెళ్లి తీయించుకోమని చెప్పాడు.  అప్పటికే వాళ్లకు ఐదు సంవత్సరాల బాలుడు ఉన్నాడు.  భర్త ఆటో డ్రైవర్.. చాలీ చాలని సంపాదన.. ఒక్కరితో చాలనుకున్నారు.  కమిట్ కావడంతో.. తప్పలేదు.  


అయితే, ఆ మహిళ గర్భం రాకుండా ఆపరేషన్ చేయించుకున్నానని చెప్పడంతో కమిట్ అయ్యాడు.  హాస్పటిల్ కు వెళ్లిన తరువాత గర్భంలో ఉన్న శిశువును పరీక్షించారు.  అయితే, అప్పటికే అబార్షన్ కావడానికి వివిధ రకాల మందులు వాడటంతో.. నొప్పులు వచ్చాయి.  బాత్ రూమ్ లోకి వెళ్లి మహిళ శిశువును కానీ అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది.  బాత్ రూమ్ లో మృత శిశువును చూసి.. సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు రంగప్రవేశం చేసి విచారించి మృతశిశువును ఆ తల్లిదండ్రులకు అప్పగించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: