అనంతపురం జిల్లాలోని హిందూపురానికి చెందిన కమలమ్మ, చంద్ర దంపతులకు ఐదు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. సంవత్సరం క్రితం కమలమ్మ తన భర్తకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోనప్పటికీ చేయించుకున్నానని చెప్పింది. అలా చెప్పిన కొన్ని నెలల తరువాత కమలమ్మ గర్భం దాల్చింది. గర్భం దాల్చినప్పటికీ కమలమ్మ ఈ విషయం గురించి భర్తకు చెప్పలేదు. 
 
భర్తకు ఈ విషయం తెలియటంతో గర్భం తొలగించుకోమని భార్య కమలమ్మకు చెప్పాడు. గర్భం తొలగించుకోవటానికి కమలమ్మ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆమె చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలితాన్ని ఇవ్వలేదు. గర్భం పోవటం కొరకు కమలమ్మ నాటు మందులను కూడా వాడింది. ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకున్న కమలమ్మకు కడుపులోని శిశువు అంగ వైకల్యంతో ఉన్నట్లు తెలిసింది. నెలలు నిండిన తరువాత నొప్పులు రావటంతో నిన్న ఉదయం కమలమ్మ ఆసుపత్రిలో కడుపునొప్పితో చేరింది. 
 
ఆ తరువాత ఆసుపత్రిలో బాత్ రూం కు వెళ్ళిన కమలమ్మ బాత్ రూమ్ లో మృత శిశువుకు జన్మనిచ్చింది. ఊహించని ఈ పరిణామానికి భయపడిన కమలమ్మ బిడ్డను అక్కడే వదిలేసింది. గర్భం పోవటానికి ఇష్టం వచ్చిన రీతిలో మందులు తీసుకోవటంతో కడుపులోని బిడ్డ చనిపోయింది. ఆ తరువాత కమలమ్మ రక్తపు మరకలతో ఉన్న దుస్తులతో బయటకు వచ్చి ఆసుపత్రి నుండి వెళ్ళిపోయింది. ఆ తరువాత బాత్ రూం కు వెళ్ళిన సిబ్బందికి కవరులో చుట్టిపెట్టిన మృత శిశువు కనిపించింది. 
 
ఆసుపత్రి సిబ్బంది ఈ విషయం గురించి సూపరిండెంట్ కు తెలిపారు. సూపరిండెంట్ పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేసాడు. పోలీసులు విచారణ కోసం కమలమ్మ ఇంటికి వెళ్ళి ప్రశ్నించగా మొదట నిజం ఒప్పుకోని కమలమ్మ ఆ తరువాత నిజం చెప్పింది. విచారణ తరువాత పోలీసులు మృత శిశువును కమలమ్మ దంపతులకు అప్పగించారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: