కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ ఇప్పటీకే చాలా రాద్ధాంతం చేసింది. కాశ్మీర్లో అలజడులు రేపేందుకు ఇప్పటికే ప్రణాళికలు చేసినట్టు భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎప్పుడు లేనిది మీడియా ముందుకు వచ్చి చెప్పారు. కాశ్మీర్ లోకి సుమారు 200 పైగా ఉగ్రవాదులును దింపేందుకు పాక్ ప్లాన్ చేసినట్టు .. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనితో పాక్ గట్టిగ గుణపాఠం చెప్పాలని భారత్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పాక్ భారత్ కు గగనతల ప్రవేశాన్ని కల్పించడం లేదు. అయితే భారత్ తో యుద్ధం తప్పదని పాక్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. యుద్ధమే వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ వశమవటం ఖాయం. భారత్ కూడా అదే కోరుకుంటుంది. 

భారత్ ఎక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆక్రమించుకుంటుందోనని పాక్ లో ఆ ఆందోళన క్లియర్ గా కనిపిస్తుంది. అందుకే పైకి ఈ వ్యాఖ్యలు చేస్తుందని చెప్పాలి.  కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగం కాదని ఎప్పటికైనా తాము చేజిక్కించుకుంటామని పాక్ కలలు కనింది. కానీ మోడీ ప్రభుత్వం ఒక్క దెబ్బతో కాశ్మీర్ ను భారత్ లో కలిపేసుకుంది. దీనితో భారత్ తమ నెక్స్ట్ టార్గెట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని తేల్చి చెప్పింది.


ఇప్పుడు ఇదే విషయం పాక్ ను ఖంగారు పెట్టిస్తుంది. ఇన్ని రోజులు కాశ్మీర్ కు స్వయం ప్రతి పత్తి ఉండటంతో పాక్ చాలా ఆటలు ఆడింది. కానీ ఇప్పుడు పీఓకే ను పాక్ కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ మాత్రం తేడా జరిగిన భారత్ .. పీఓకేను భారత్ లో కలిపేసుకుంటుందని పాక్ కు బాగా తెలుసు.  అయితే కాశ్మీర్ విషయంలో ఐరాస పట్టించుకోకపోవడంతో ... పైగా ఇది భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పడంతో పాక్ ఎక్కడ లేని అసహనానికి గురవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: