వైకాపా అధికారంలోకి వచ్చిన రోజునే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.  చెప్పినట్టుగా గ్రామాల్లో గ్రామ వాలంటీర్లను నియమించారు. దాదాపు 2.5 లక్షల మంది ఈ ఉద్యోగంలో చేరారు.  గ్రామాల్లో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పధకాలను సక్రమంగా అందేలా చూడటమే వీరి విధి.  దానికోసమే గ్రామ వాలంటీర్ పనిచేయాలి.  


గ్రామ వాలంటీర్ విధివిధానాలు పక్కాగా ఉంటాయి.  ప్రభుత్వం నుంచి పధకాలు అందేవిధంగా చూడాలి.  అంతేగాని, కార్డుల్లో తప్పులు ఉంటె వాటిని సరిచేసే బాధ్యత వాలంటీర్లకు ఉండదు.  అది వారి పరిధిలోకి రాదు.  ఈ సమస్య ఇప్పుడు ఓ అమ్మాయి ప్రాణాన్ని తీసింది.  గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న నవీన అనే అమ్మాయి.. ఇటీవలే ఓ ఇంటికి వెళ్లి ఆధార్ గురించైనా దిగింది.  


అదే క్రమంలో ఆ ఇంట్లో వాళ్ళు ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయని, సరిచేయాలి అడిగారు.  అది తన పరిధిలోకి రాదనీ, తనకు సంబంధం లేని విషయం అని చెప్పింది. కానీ, వాళ్ళు వినలేదు.  నవీనపై విరుచుకు పడ్డారు.  పరుష పదజాలంతో మాట్లాడారు.  దీంతో గ్రామ వాలంటీర్ నవీన మనస్తాపం చెందింది. ఆత్మహత్య చేసుకునే ముందు లెటర్ రాసి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  


ఆధార్ గొడవ కారణంగానే నవీన ఆత్మహత్యకు పాల్పడిందని నవీన తండ్రి శ్రీరామ్మూరి అంటున్నారు.  పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.  దీనిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని పండువారిగూడెంలోని జరిగింది.  అయితే, సూసైడ్ నోట్ లో ఏమి రాసిందనే విషయం బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.  ఉద్యోగం వచ్చిన కొన్ని రోజులకే ఇలా విషాదం జరగడం ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: