గానకోకిల.. లతా మంగేష్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. సంగీత రంగంలో ఆమె చేసిన కృషికి.. డాట‌ర్ ఆఫ్ ది నేష‌న్ వరించింది. ఈనెల 28న 90వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా.. ఆమెకు ఈ అవార్డును అందజేయనుంది కేంద్రం. లెజండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ 70ఏళ్ల సినీ సంగీత ప్రస్థానంలో ఎన్నో మరుపురాని గీతాలున్నాయి. 89 ఏళ్ల వయస్సులోనూ.. తన మధురమైన గొంతుతో ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు లతా  దీదీ. సినీ సంగీతంలో 70ఏళ్లపాటు  ఆమె చేసిన కృషికి .. డాటర్ ఆఫ్‌ ది నేషన్‌ అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 28న 90వసంతాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ అవార్డుతో సత్కరించనుంది. 


1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన లతా మంగేష్కర్‌... 13ఏళ్లకే పాట ప్రయాణం మొదలుపెట్టారు. తండ్రి మృతి తర్వాత కుటుంబ బాధ్యత చేపట్టిన ఆమె... బాలీవుడ్‌ సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్‌గా అవకాశం సంపాదించారు. లతకు ... మహల్ సినిమాతో బ్రేక్‌ లభించింది. ఆయేగా ఆనేవాలా పాట ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది. 1958లో ఆజా రే పరదేశి పాటకు తొలి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వరించింది. ఈ పాట పాడిన దశాబ్ధానికి పద్మభూషన్‌ అవార్డు వచ్చింది.  ఇక 1963లో లతా మంగేష్కర్ పాడిన... యే మేరి వతన్‌ కే లోగో...లతకు ఎనలేని ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఇండియాచైనా యుద్ధంలో మరణించిన వీరజవాన్ల కోసం ఈ పాటను పాడారు. ఈపాట విన్న అప్పటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ...కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె గొంతుకు ముగ్ధుడైన నెహ్రూ... గాన కోకిల బిరుదు ఇచ్చారు. లతా మంగేష్కర్‌ను ఎన్నో అవార్డులు, పురస్కరాలు వరించాయి. 1989లో దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు, 1999లో పద్మ విభూషన్‌, అదే ఏడాది ఎన్టీఆర్ నేషనల్‌ అవార్డు వరించాయి. ఇక 2001లో అత్యున్నత పురస్కారం భరత రత్నతో సత్కరించింది అప్పటి ప్రభుత్వం. లతా మంగేష్కర్‌ సింగరే కాదు.. మంచి వాయిస్‌ ఓవర్ ఆర్టిస్ట్‌ కూడా . నాటి వైజయంతి మాల నుంచి నేటి ప్రీతి జింటా వరకూ... చాలా మంది బాలీవుడ్‌ హీరోయిన్లకు గాత్రదానం చేశారు లతా దీదీ.  అందుకే.... దీదీ  ది గ్రేట్ ! 


మరింత సమాచారం తెలుసుకోండి: