హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్‌లో భారీ పేలుగడు చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతమంత భయాందోళన నెలకొంది. ఎవరైన బాంబు దాడికి పాల్పడ్డరేమోనని ఉలిక్కి పడ్డారు. అయితే పుట్‌పాత్‌పై ఉన్న ఉన్న టిఫిన్ బాక్సు వల్ల పేలుడు జరిగింది. అయితే ఓ వ్యక్తి టిఫిన్ బాక్స్ ను తెరవడంతో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి బాక్సు తెరిచిన వ్యక్తి చేతులు తెగిపోయాయి. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుదూ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి రాజేంద్రనగర్ కు చెందిన యాచకుడు ఆలీగా గుర్తించారు. రాజేంద్రనగర్‌ పోలీసు పరిధిలోని శివరాంపల్లి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. సంఘటన సమాచారం తెలుసుకున్న నగర పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. డాగ్ స్వ్కాడ్ తో వచ్చి తనిఖీలు చేపట్టారు. ముందే ఉగ్రవాదుల కన్ను హైదరాబాద్ పై ఉన్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరైన బాంబు పెట్టారేమోనన్న అనుమానంతో క్షణ్ణంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు.  అయితే ఆ డబ్బా చెత్తకుప్పల్లో ఏరుకొని తెచ్చిన కెమికల్‌ డబ్బాగా పోలీసులు అనుమానిస్తున్నారు. భారీ శబ్దంతో పేలుడు సంభవిచండంతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లంతా ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. ఘటన స్థలంలో ఉన్న వారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ పేలుడుపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

 

పేలింది బాంబు కాదు…

పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించాక పేలుడు సంభవించడానికి బాంబ్ కారణం కాదని పోలీసులు గుర్తించారు. ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పేలుడు అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించామని ఆయన చెప్పారు. కెమికల్‌ కారణంగానే పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నట్టు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్.. పేలుడుకి సంబంధించిన వివరాలను డీసీపీని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు సైబరాబాద్ సీపీ సజ్జనార్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: