దాదాపు వంద కోట్లకు పైగా భారతీయుల ప్రార్థనలు విని ఏ దేవుడు కరుణించాడో ఏమో కాని మళ్ళీ చంద్రయాన్-2 మిషన్ విజయం బాట పట్టింది. అనూహ్యరీతిలో నిన్న కనిపించకుండా పోయిన విక్రమ్ లాండర్ చంద్రయాన్-2 ఆర్బిటర్ కు దొరికింది. నిన్న తెల్లవారుజామున విఫలమైన మిషన్ వల్ల యావత్ దేశం దిగ్భ్రాంతికి గురి అయింది. ఎంతో మంది సెలబ్రెటీలు, స్టార్లు, ఇతర దేశాల ప్రధాన మంత్రులు ఎంత ఓదార్చిన తగ్గని బాధని మళ్లీ మన శాస్త్రవేత్తలే తుడిచి వేశారు.

కనపడకుండా పోయి మళ్లీ దొరికిన విక్రమ్ ల్యాండర్ ఇదే 



నిన్నటి నుండి 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలం చుట్టూ తిరిగే చంద్రయాన్-2 ఆర్బిటర్ కొద్దిసేపటి క్రితమే విక్రమ్ ల్యాండర్ యొక్క సరైన స్థానాన్ని చంద్రుడు పైన గుర్తించింది. అది పంపిన ఉష్ణగ్రాహక చిత్రాలను పరిశీలించిన మీదట అది విక్రమ్ ల్యాండరే అని గుర్తించారు. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో చీఫ్ అయిన కే. శివన్ మీడియాతో ప్రస్తావించారు.

నిన్న సరిగ్గా చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో నిర్దేశించిన పథం నుండి పక్కకు వెళ్లిన విక్రమ్ లాండర్.... అందరూ కుప్పకూలిపోయింది అని అనుకుంటున్న దశలో ఈరోజు మధ్యాహ్నం అనూహ్యంగా శాస్త్రవేత్తలతో పాటు దేశ ప్రజలందరి అసలు మళ్లీ చిగురించాయి. శివన్ చెప్పినదాని ప్రకారం వారు కమ్యూనికేషన్ అసలు ఎలా కట్ అయింది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అనూహ్యంగా ఆర్బిటర్ ఈ చిత్రాలను పంపిందట. దీంతో శాస్త్రవేత్తలు మరింత ఉత్తేజితపూర్వకంగా పనులు మొదలు పెట్టేసి మళ్లీ కమ్యూనికేషన్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు.




దాదాపు తొమ్మిది వందల కోట్ల పెట్టుబడితో రూపొందించిన చంద్ర అంటూ మిషన్ నిన్ను అర్ధంతరంగా ఆగిపోవడంతో అందరి మనసులు కలవరపడగా పడిన కష్టం మరియు శ్రమ ఎన్నటికీ వృధా కావు అను మరోసారి రుజువు అయింది. విక్రమ్ లాండర్ మళ్ళీ దొరకడం మన భారతదేశ శాస్త్రవేత్తలు ప్రతిభకు నిదర్శనం అని చెప్పాలి. ఇక దొరికిన ఆ ల్యాండర్ మళ్లీ మన డేటా బేస్ కు సిగ్నల్స్ పంపాలి అని మనస్పూర్తిగా కోరుకుందాం. జై భారత్ మహాన్...! 


మరింత సమాచారం తెలుసుకోండి: