గేమ్స్ సరదాగా ఆడితే బాగుంటుంది.  అదే గేమ్ ప్రాణాలు తీసే విధంగా ఉంటె భయానకంగా ఉంటుంది.  అందుకే గేమ్ ఆడేముందు ఒకటికి నాలుగుసార్లు అలోచించి ఆడాలి.. లేదంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. గేమ్ అన్నది నాలెడ్జిని పెంచాలిగాని, ప్రాణాలు తీసే విధంగా ఉండకూడదు. ఆడబోతున్న గేమ్ ఏంటి.. అందులో ఎలాంటి బాధాకసాధకాలు ఉంటాయి అనే దానిపై కూడా ఒకటికి రెండుసార్లు అలోచించి నిర్ణయం తీసుకోవాలి.  


సరదాగా ఆడాలనుకున్న ఓ గేమ్ ప్రాణాలమీదకు తీసుకొచ్చింది.  ఇంతకీ ఆ గేమ్ ఏంటి.. జరిగిన విషయం ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం.  అర్జెంటైనాలోని కార్డోబాకు చెందిన సెర్గియో అనే వ్యక్తి బరట్టి ఆమె మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.  ఇద్దరు కలిసి చాలా కాలం కలిసి ఉన్నారు.  హ్యాపీగా ఎంజాయ్ చేశారు.  ఏమైందో ఏమో తెలియదు.  సడెన్ గా ఓ రోజు సరదాగా గేమ్ ఆడదామని అడిగింది.  అందుకు సెర్గియో ఒకే చెప్పాడు. 


అది మాములు గేమ్ కాదు.. సెక్స్ గేమ్. సెర్గియో కళ్ళకు గంతలు కట్టింది.  అనంతరం అతని ఫాంట్ లాగేసింది.. రెడీ వన్ టు త్రీ అంటూ.. గార్డెన్ లో మొక్కలు కట్ చేసే కత్తెరతో అతని అంగాన్ని కోసేసింది.  దీంతో సెర్గియో షాక్ అయ్యాడు.. పెద్దగా అరిచాడు. ఏమైందో అర్ధంగాక చుట్టుపక్కల వాళ్ళు బరట్టి మాజీ బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేశారట.  మాజీ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చే సరికి సెర్గియో రక్తం మడుగులో పడి ఉన్నాడు. 


వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు ఫైల్ చేసి విచారిస్తున్నారు.  సెర్గియోను అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయంపై పోలీసులు ఆరా తీయగా, ఆమె చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు.  సెర్గియో గతంలో ఓ వీడియోను వాళ్ళ ప్రెండ్స్ కు పంపడానికి, దాంతో తనకు కోపం వచ్చి ఇలా పగ తీర్చుకున్నానని చెప్పింది.  పగ ఏదైనా ఉంటె మరోలా తీర్చుకోవాలిగాని, ఇలా చేయడం ఏంటి.. మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అనిపిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: