Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 2:47 pm IST

Menu &Sections

Search

'బాబు'కి  మళ్లీ అవకాశాలు ఉన్నాయి !

'బాబు'కి  మళ్లీ అవకాశాలు ఉన్నాయి !
'బాబు'కి  మళ్లీ అవకాశాలు ఉన్నాయి !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

గెలుపు ఓటమి అనేవి బాబుగారికి కొత్త కాదు.. నిజానికి ఓడిపోయాకే ఆయన టీడీపీలోకి ఎంటర్ అయ్యారు. మళ్లీ గెలిచేదాకా పనిచేయడం బాబుకి వ్యసనం. అయితే జగన్ ప్రభుత్వం పై ఈ మధ్య బాబు పదునైన ఆరోపణలను చేస్తూ.. తెలుగు తమ్ముళ్ళో  చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  వైసీపీ వంద రోజుల పాలనలో ఎక్కడా శాంతి భద్రతలు లేవని..  ఈ వంద రోజుల పుణ్యమా అని,  'వైకాపా ప్రభుత్వ బాధితుల పునరావాస కేంద్రం' పెట్టాల్సిన అవసరం వచ్చిందని..  అయినా  'బాధితుల పునరావాసనిధి' ఏర్పాటు చేయడం దేశంలో ఎప్పుడయినా జరిగిందా ? అని బాబు తాజాగా చేసిన ఆరోపణ. అలాగే 'గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు ప్రస్తుత ప్రభుత్వం పున:సమీక్షించడం ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా ? వాస్తవానికి ఎక్కడా జరగలేదు. జగన్ గారే ప్రవేశపెట్టారు. అయితే దీని వల్ల  రూ.9000 కోట్ల పనులు నిలిచిపోయాయి' అని ఇటీవలే ఓ  సీఈఓ కూడా పేర్కొన్నాడు. ఆ డబ్బు నష్టం  ప్రజల మీదే పడుతుందిగా.  పైగా 'వైసీపీ ప్రభుత్వ తీవ్రవాదమని' పారిశ్రామికవేత్తలు కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు కూడా. అదేవిధంగా  కియా కారు విడుదల కార్యక్రమంలో వైసీపీ ఎంపీ బెదిరింపుల ఫలితంగా 17అనుబంధ పరిశ్రమలు తరలిపోయ్యాయి.  టాక్స్ కట్టలేదని సోలార్ ప్యానెళ్లు పగులగొట్టి, నిర్వాహకులను తుపాకీతో బెదిరించిన ఘటన వైసీపీ వచ్చాకే జరిగిందట. ఇలాంటి పదునైన ఆరోపణలు అయితే బాబు చేస్తున్నాడు గాని.. బాబులో మునపటి  ప్రణాళికలు కనిపించడం లేదు. అందుకే తెలుగుదేశం  పార్టీ నాయ‌కులు, పార్టీని న‌మ్ముకుని ఏళ్ల త‌ర‌బ‌డి అలుపెరుగ‌ని సేవ‌లు చేసిన కార్య‌క‌ర్త‌లు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. అయినప్పటికీ  మళ్లీ బాబు సీఎం అవ్వటానికి ఇంకా  అవకాశాలు ఉన్నాయి. ఎడారిలో సైతం  అవసరం అయితే  నీళ్లను  సంపాధించేంత ఓపిక తెలివితేటలు బాబుకు ఉన్నాయి. ఇప్పటికైనా బాబు   ఓట‌మికి గల కార‌ణాల‌ను విశ్లేషించుకుని చేసిన త‌ప్పుల‌ను స‌వ‌రించుకుని పక్కా ప్ర‌ణాళిక‌లతో ముందుకు వెళ్తే.. ఖచ్చితంగా బాబు పై  వ్యతిరేకత తగ్గుతుంది. 


 పైగా ప్ర‌త్య‌ర్ధి పార్టీ బ‌ల‌హీన‌త‌ల‌ పై పాలనలో జరుగుతున్న లోపల పై  బాబుకి పూర్తి అవగాహన ఉంటుంది. ఆ విషయాలన్నిటినీ సోషల్ మీడియాలో  పోస్ట్ చేసి సరిపుచ్చకుండా..  ప్రజల్లోకి పూర్తిగా వెళ్లేలా చొరవ తీసుకోవాలి. తమ  బ‌లాల‌ను  తమ నాయకులతో పాటుగా కార్యకర్తలకు అర్ధం అయ్యేలా చెప్పి..  అవ‌స‌రం మేర‌కు వారి చేత పార్టీ సిద్దాంతాలను  అమ‌లు చేసే విధంగా ముందుకు సాగాలి. అలాగే  నాయ‌క‌త్వ లోపం లేకుండా..  ప్రతి ఏరియాకి యాక్టివ్ గా ఉండే  ఒక నాయకుడ్ని పెట్టాలి.  ఇలా వ‌చ్చే ఎన్నిక‌ల‌ నాటికీ ఇలా ప్ర‌ణాళిక‌లు వేసుకుని ముందుకు వెళ్తే.. బాబు మళ్ళీ సీఎం అవ్వొచ్చు.  అలా అవ్వాలంటే బాబు ముందు తన పబ్లిసిటీ మీద కాకుండా..  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ పైన పోరాటం చేయ‌గ‌ల‌గాలి. ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతూ ఉండాలి.  గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌కు, ఈ ప్ర‌భుత్వ పాల‌న‌కు తేడా అంశాల‌ను నోట్ చేస్తూ అప్పుడ‌ప్పుడూ నాయ‌కుల‌తో అధినేత స‌మీక్ష‌లు జరపాలి. ఇవన్నీ బాబు ప్రస్తుతం చేస్తున్నారుగా అనకుండా.. ప్రతి ఏరియాలోకి వెళ్లేలా చేసుకుంటూ పోవాలి.  అలాగే  అంద‌రికీ  తమ ఆలోచ‌న‌లు పంచుకునేందుకు, పార్టీలోని లోటుపాట్లు గురించి ఫిర్యాదు చేసిందుకు  అందరికి అవకాశాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.  ముఖ్యంగా పార్టీని న‌మ్ముకుని ఉన్న నాయ‌కులు  అసంతృప్తితో కొట్టుమిట్టాడుకుండా వారికీ భవిష్యత్తు పై భరోసా ఇవ్వాలి.  యువ నాయ‌క‌త్వానికి పెద్ద పీఠ వేయాలి.  ఇలా సందర్భానుసారంగా  మేటి ప్ర‌ణాళిక‌లు వేస్తూ  ముందుకు వెళ్ళితే..  మళ్లీ  చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. 


Defeat is not new to Babugari. In fact, he entered the TDP after losing. It is addictive to work until you win again.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అరె డిసెంబర్ లో  మొదలెట్టనున్నాడట  !
ప్చ్..   బీజేపీని ఎలా అడ్డుకుంటారో  ?
లెజెండ్.. చిరంజీవి కోసమే డబ్బులు తీసుకోలేదట !
'అల వైకుంఠపురములో'.. రిలీజ్ డేట్ ఫిక్స్   !
'సైరా'కి వీళ్ళిద్దరూ తలనొప్పిగా మారారు.
అక్టోబర్ 8న  బాలయ్య యాక్షన్ టీజర్ !
జగన్ ను బాగానే టార్గెట్ చేస్తున్నాడుగా !
అఖిల్ కోసం స్టార్ హీరోయిన్ వచ్చేసింది !
పాపం..   'సైరా' ముందు  'చాణక్య' కష్టమే !
శివప్రసాద్‌  రాజీలేని పోరాటం చేశారు   !
అరె.. బాలయ్య డెడికేషనా.. మజాకా !
'వాల్మీకి'లో మెయిన్ హైలెట్స్  ఇవే !
మెగా హీరోలు అంటే.. ప్రత్యకమైన ప్రేమ  !
అరె..  పవన్ చాలానే ప్లాన్ చేస్తున్నాడుగా  !
'నిఖిల్'కి  'సైరా' తరువాత కూడా కష్టమే !
టెస్ట్ షూట్ కి రెడీ అంటున్న  కంగనా !
అఖిల్ కోసం రెడీ అవుతోన్న  పూజా హెగ్డే   !
అక్కడి  స్టార్స్ కి  ముందుగానే  'సైరా' ప్రీమియర్ షో  !
ఎన్నారైగా  నటించనున్న సెన్సేషనల్ స్టార్  !
వైద్య రంగంలో  జగన్ కీలక నిర్ణయాలు !
ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగారి స్థాయిని త‌గ్గించ‌డట !
మరి  'భీష్మ' ముంచుతాడో ? నిలబెడతాడో  ?
టీఆర్ఎస్‌ చావుని కేసీఆర్ ఆపగలడా ?
బన్నీకి  జోడిగా పల్లెటూరి పిల్ల !
'సైరా ట్రైలర్'..  సంబరాల్లో  మెగా ఫ్యాన్స్  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.