తమిళ చిత్రాలలో నటించి నటుడిగా మంచిపేరు తెచ్చుకున్న రాజశేఖర్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. రాజశేఖర్ నటుడిగానే కాక తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకునిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంతకాలం నుండి రాజశేఖర్ అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతం రాజశేఖర్ యొక్క వయస్సు 62 సంవత్సరాలు. చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం రాజశేఖర్ మృతి చెందారు. 
 
రాజశేఖర్ మరణ వార్తతో రాజశేఖర్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అభిమానుల నుండి రాజశేఖర్ కు సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. రాజశేఖర్ మొదట దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టాడు. చిన్నపూవే మెల్ల పెసు, పలేవనచోలై మొదలైన సినిమాలకు రాజశేఖర్ దర్శకత్వం వహించి విజయాలు సాధించాడు. రాజశేఖర్ చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో నటుడిగా శిక్షణ కూడా పొందాడు. 
 
ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వంలో రాజశేఖర్ నటుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. 1980 వ సంవత్సరంలో నిగల్ గలై పేరుతో విడుదలైన  సినిమా రాజశేఖర్ కు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ రాజశేఖర్ ఇద్దరూ మంచి స్నేహితులు. రాజశేఖర్ దర్శకునిగా మారటానికి రాబర్ట్ తో ఉన్న స్నేహమే కారణం. రాబర్ట్ సినిమాటోగ్రాఫర్ గా రాజశేఖర్ దర్శకుడిగా మనసుక్కుల్ మతప్పు మరియు ఒరు తాళై రాగం సినిమాలు వచ్చాయి. 
 
ఈ సినిమాల తరువాత రాజశేఖర్ నటుడిగానే కొనసాగారు. శరవణన్ మీనాక్షి అనే సీరియల్ లో హీరో తండ్రి పాత్రలో రాజశేఖర్ నటించి మెప్పించారు. శరవణన్ మీనాక్షి సీరియల్ హిట్ కావటంతో రాజశేఖర్ కు చాలా సీరియల్స్ లో ఆఫర్లు వచ్చాయి. వరుస ఆఫర్లు రావటంతో సినిమాలకు దూరంగా ఉంటూ రాజశేఖర్ సీరియల్స్ లో ఎక్కువగా నటించారు. రాజశేఖర్ మృతి చెందటంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: