గత నెల రోజులుగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా అందరికీ జ్వరాలు జలుబు దగ్గు జ్వరం. ఇది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు రెండు వారాలు నెలరోజులపాటు జ్వరాలు తగ్గకుండా అలాగే ఉండటంతో అందరూ హడలిపోతున్నారు. వైరల్ ఫీవర్ లు అధికంగా ఉన్న రోజులలో ఇది డెంగ్యూ చికెన్గున్యా మలేరియా నో తెలిక అందరూ భయంతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.

అసలు పేషెంట్లను చూసి వాళ్లకి మందులు ఇచ్చే సమయం మాకు దొరకడం లేదు అని డాక్టర్లు అందరూ చేతులెత్తేస్తున్నారు. అంత సంఖ్యలో ఈ జ్వరాలు కేసులతో పేషెంట్లు ఆస్పత్రులకు చేరుకున్నారట. ఈ కేసులలో రక్త పరీక్షలు చేయించుకున్న వారిలో చాలామందికి డెంగ్యూ వ్యాపించినట్టు గా నమోదైంది.

రోజురోజుకు డెంగ్యూ కేసులు పెరిగిపోవడంతో అసలు ఇన్ని డెంగ్యూ కేసులు ఎలా వస్తున్నాయి ఎక్కడినుంచి వస్తున్నాయి ఆస్పత్రుల్లో ఏం చేస్తున్నాయి డాక్టర్లు ఏం చేస్తున్నారు అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించడం మొదలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం డెంగ్యూ కేసులపై తనకు పూర్తి రిపోర్టును అందించాలని వెంటనే తీర్మానం ఇచ్చింది.

ఇంటి చుట్టూ నీరు చేరి ఉన్న లేదు అంటే మొక్కలు సంఖ్య ఎక్కువగా ఉన్నవారు తలుపులు వేసుకుని సాయంత్రం పూట దోమలు చొరబడకుండా చొరబడిన కూడా వాటి నుంచి రక్షణగా ఏదో ఒక పాటించాలి అని, జ్వరం వచ్చి నట్టు అనిపిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్షలు చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రయాణాలు మానుకుని కొన్నాళ్లపాటు ఇంటిపట్టున అందరూ ఉండడానికి ప్రయత్నించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ఇంత పెద్ద సంఖ్యలో డెంగ్యూ వ్యాపించడం వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసుకోవాలని హైకోర్టు జస్టిస్ వారు ప్రభుత్వం నుంచి రిపోర్టు కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: