హాంగ్ కాంగ్ లో గత నాలుగైదు నెలలుగా జరుగుతున్న పోరాటం మనందరికీ తెలిసిన విషయమే. ప్రతిరోజు వార్తల్లో హాంకాంగ్లో కొన్ని లక్షల సంఖ్యలో చేస్తున్న పోరాటంలో చనిపోయిన వారి గురించి మనం వింటూనే ఉన్నాము. దీని ఉద్రిక్తత రోజురోజుకీ పెరగడం మనం గమనిస్తున్నాం. కానీ ప్రపంచ దేశాలు ఎన్ని చెప్పినప్పటికీ చైనా ఈ విషయం మీద ఏమాత్రం తగ్గడం లేదు.


బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి వచ్చిన తరువాత హాంగ్కాంగ్ దేశం చైనా లో ఒక భాగంగానే పరిగణలోకి వచ్చింది. కానీ నెమ్మదిగా హాంగ్కాంగ్ ప్రజలకు చైనా మీద వ్యతిరేక భావన ఏర్పడటం మొదలైంది అయినా కూడా కొన్ని దశాబ్దాలుగా పరిపాలిస్తున్నారు పూర్తి కాకుండా చైనా కిందకే వచ్చిన ఒక ప్రత్యేకమైన రాజ్యాంగ పాలన మరియు ఎన్నికలు జరుగుతాయి.


తాజాగా చైనా ప్రపంచ దేశాలు అన్నిటిలోకి రారాజుగా ఎదగాలని కోరుకుంటూ ఉంది కాబట్టి ఏ చిన్న దేశం ఎక్కడ అయినా తన చేయి జారిపోతుంది అనిపిస్తే దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. హాంగ్కాంగ్ విషయంలో కూడా అదే జరిగింది కానీ చైనీయులు చేసిన ఒక చిన్న తప్పు ఇంత పెద్ద రాద్ధాంతం గా మారి ఒక తుఫాను గా రాబోతోంది. ఈ పోరాటాన్ని ఎంత అనిచివేత ఏమన్నా సరే హాంకాంగ్లో ప్రజలు ఆఖరికి ఇంటికి వెళ్ళిన తర్వాత వారి కిటికీలోంచి అర్ధరాత్రులు ఒకరితో ఒకరు ఇలా అరుచుకుంటూ సంభాషణలు చేసుకుంటూ ప్రోత్సహించి ఉంటున్నారట.


హాంకాంగ్ ప్రజలలో ఎవరిమీదైనా అనుమానం వస్తే వారిని జైలుకు పంపించిన తర్వాత ఖైదీలను డైరెక్ట్ గా చైనా కి పంపించి అక్కడ వారి ప్రాసిక్యూషన్ జరపాలి అనే ఒక బిల్లును ప్రవేశపెట్టినందుకు ఈ హాంకాంగ్ పోరాటం మొదలైంది. రాబోయే రోజుల్లో హాంకాంగ్ చైనా పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: