లాయర్ రాంజెఠ్మలానీ ఈరోజు కన్నుమూసారు. ఆయన మీద అభిమానం ఉన్న ఎంతో మంది రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు ఈ దేశానికి తీరని లోటు అని ఎంతోమంది వ్యాఖ్యానించారు.  ఒకప్పుడు బీజేపీలో మంత్రి పదవిలో ఉన్నా కూడా ఆ తరువాత పార్టీ లోంచి బయటకు వచ్చి వాజ్పాయి కి వ్యతిరేకంగా లక్నో నుంచి పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే.


అయినప్పటికీ కూడా రాంజెఠ్మలానీ కన్నుమూసారు అని తెలిసిన వెంటనే బిజెపి ఉన్నతశ్రేణి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో సహా అందరూ ఢిల్లీకి చేరుకుని నివాళులు అర్పించారు. దేశానికి రాంజెఠ్మలానీ చేసిన సేవలు ఎంతో ఘనమైనది అని పీఎం మోడీ తో సహా అందరూ పేర్కొన్నారు. ఇటీవలే కన్నుమూసిన అరుణ్ జైట్లీ కి వ్యతిరేకంగా రాంజెఠ్మలానీ కేసులు వాదించిన అప్పటికి కూడా బిజెపికి రాంజెఠ్మలానీ మధ్య వైరం పెరగలేదు.


ఆనాడు అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా కేసును వాదించి కేజ్రీవాల్ను కాపాడటం కోసమే. ఆనాడు కేజ్రీవాల్ పైన అరుణ్జైట్లీ వేసిన కేసును వాదిస్తున్న రాంజెఠ్మలానీ ఒక సమయంలో ఆవేశాన్ని ఆపుకోలేక జైట్లీ పైన విపరీతమైన ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఆరోజున కోపంలో జైట్లీ నీకు నాకు మధ్య జరగడం లేదు ఈ కేసు నాకు కేజీ వాళ్లకు మధ్య అని కోర్టు గుర్తుచేసేలా చేశారు.


రామ్ జెఠ్మలానీ కన్నుమూయడంతో కేజ్రీవాల్ ఇది ఆయనకు తీరనిలోటు అని ఆయనకి ఏ అవసరం ఉన్న రాంజెఠ్మలానీ ఎప్పుడూ అండదండగా నిలిచే వారు అని, తనకి తన కేసులలో ఎంతో సహాయం చేసి తను తిరిగి రుణం తీర్చుకునే అవకాశం లేకుండా వెళ్ళిపోయారు అని కన్నీరు పెట్టుకున్నారు. రామ్ జెఠ్మలానీ తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు అని కేజ్రీవాల్ పేర్కొనడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: