సాధారణంగా మన ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర సహాయాన్ని కోసం మందులు అన్నీ జాగ్రత్తగా పెట్టే ఉంటారు. కానీ ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే వెంటనే సహాయం అందించేందుకు డాక్టర్లు సైతం ఫ్లైట్లో ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ అనుకోని విధంగా ఏదైనా పెద్ద ప్రమాదం చోటు చేసుకుంటే ఆ ఫ్లైట్ వెంటనే ల్యాండ్ అవలేదు కాబట్టి ఏదైనా దగ్గరలోని ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యేంతవరకు పేషెంటు ప్రమాదంలో ఉన్నట్లే.

అది భూమి మీద ప్రయాణం చేస్తున్న వాళ్లకు అయినా అదే పరిస్థితి కలుగుతుంది రైలులో ప్రయాణం చేసే వాళ్లకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే మరొక స్టేషన్లో దిగి ఎంతవరకు ఆ స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లి అంతవరకు ఉన్న సమయంలో హఠాత్తుగా మరణిస్తే దానికి ఎవరూ ఏమీ చేయలేరు. ఇటువంటి పరిస్థితే తాజాగా స్పైస్జెట్ యాజమాన్యం కూడా చవిచూసింది.

ఒక ప్రయాణికుడికి ఊపిరి అందుకోవడంలో ఇబ్బంది ఉంది అని చెప్పగా ఇమీడియట్గా దగ్గరలోని ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించిన తర్వాత అక్కడి డాక్టర్లు అప్పటికే అతను మరణించాడని ధ్రువీకరించారు. ఫ్లైట్ లో ఉండగానే ఊపిరి అందుకోవడంలో నాకు ఇబ్బందిగా ఉంది అని అవస్థ పడుతూ ఒక ప్రయాణికుడు యాజమాన్యానికి చెప్పగా హుటాహుటిన ఒడిశాలో లాండింగ్ చేయమని ఆదేశాలు జారీ చేశాయి. ఫ్లైట్ చెన్నై నుంచి కోల్కతా మీదకు ప్రయాణిస్తోంది.

ఫ్లైట్ లో ఉండగానే పక్షవాతం వచ్చినట్లుగా కనిపించింది అని చూసిన వాళ్లు చెబుతున్నారట. ఆసుపత్రికి తీసుకు వెళ్ళిన తర్వాత అప్పటికే మరణించారని చెప్పడం జరిగింది కావున ఇక వాడిని మార్చురీకి తరలించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు.

ఇది ఫ్లైట్లో ప్రయాణించడం వల్ల జరిగిన ప్రమాదం ఏమీ కాదు అని ఇలాంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి కానీ వాటిలో కొన్ని ఇలా దుర్ఘటన పాలు అవుతాయని యాజమాన్యం పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: