2014 వ సంవత్సరంలో మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అయన గురించి ప్రపంచానికి తెలిసింది. మోడీకి ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు.  అందుకే అయన మాటలను అందరూ ఇష్టపడతారు. అందరు నమో జపం చేయడానికి ఇది కూడా ఒక కారణం.  మోడీని ప్రతి ఒక్కరు ఇష్టపడటానికి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి.  అందుకు ఓ ఉదాహరణ ఇటీవలే ఇస్రోలో అయన చేసిన ప్రసంగం అని చెప్పొచ్చు.  


చంద్రయాన్ 2 ల్యాండర్ లాండింగ్ సమయంలో మోడీ ఇస్రో కేంద్రం బెంగళూరులో ఉన్నారు.  చంద్రయాన్ ను 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా సిగ్నల్స్ మిస్ కావడంతో అందరిలో నిరాశ నెలకొన్నది.  అయితే, గతంలో అనే నాయకులు ఇలాంటి విషయాలు ఏదైనా జరిగినపుడు సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు.  


కానీ, మోడీ అలా కాకుండా... ఆ రాత్రి బెంగళూరులోనే ఉండి.. ఉదయాన్నే ఇస్రోలో మీటింగ్ పెట్టాడు. జాతిని ఉద్దేశించి మాట్లాడాడు.  ఇస్రో చేసిన సేవల గురించి భారతదేశానికి వివరించాడు.  ఇది ఫెయిల్ కాలేదని చెప్పాడు.  ఇస్రో వెంట దేశం యావత్తు నిలుస్తుందని అన్నాడు. ఇస్రో ల్యాండింగ్ సమయంలో దేశంలోని ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయి కూర్చున్నారు అంటే... ఇస్రో ప్రతిభ ఏంటో అర్ధం అయ్యిందని ఇస్రో ఈ విషయంలో ఫెయిల్ కాలేదని అన్నారు. మరో అడుగుకు ఇది పునాది అని చెప్పారు.  


వెళ్లే సమయంలో ఇస్రో చైర్మన్ శివన్ ను హత్తుకొని ఓదార్చారు.  ఆ ఒక్క సన్నివేశం దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది.  మోడీ స్థాయిని నిరూపించింది.  ఇస్రో కష్టాన్ని ఆ సన్నివేశం ఒక ధైర్యాన్ని ఇచ్చింది.  ఇస్రో గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసింది.. ఇస్రో చైర్మన్ గురించి అందరికి తెలిసేలా చేసింది.  తరువాత మోడీ హరియాణాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో మాట్లాడిన విధానం ఆకట్టుకుంది. రోహతక్ ప్రజలు తాను అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తున్నారని మాట్లాడారు.  దీంతో అక్కడి ప్రజలు ముగ్దులయ్యారు.  దట్ ఈజ్ మోడీ. ఎక్కడ ఎలా మాట్లాడాలో మోడీకి బాగా తెలుసు.  


మరింత సమాచారం తెలుసుకోండి: