గత ప్రభుత్వంలో ఉద్దాన భాదితుల కోసం పవన్ కళ్యాణ్ గట్టిగా కృషి చేశారు. విదేశాల నుంచి రీసర్చ్ బృందాన్ని తీసుకువచ్చి సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా ప్రయత్నం చేశారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్దాన కిడ్నీ భాదితుల కోసం 200 పడకల హాస్పిటల్ ను .. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతుంది. జగన్ చేస్తున్న ఈ మంచి పని పట్ల పవన్ గారు అసలు స్పందించడం లేదు. గత ప్రభుత్వంలో బాబు గారితో బాగా తిరిగారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారే సరికే జగన్ చేస్తున్న గొప్ప పనులు కూడా పవన్ మేధావికి నచ్చడం లేదు. ఇప్పుడు కూడా పవన్ స్పందించకపోతే సంకుచిత రాజకియాల కోసమే పవన్ ఉన్నారని అర్ధం చేసుకోవాలి. 


ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ .. టీడీపీర్ రెండు ఒకటేనని వైసీపీ ప్రధానంగా ఆరోపించింది. ఎన్నికల ముందు విడిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నాడని పవన్ ను జగన్ విమర్శించారు. అయితే పవన్ కళ్యాణ్ శైలి కూడా జనాల్లో జనసేనకు టీడీపీకి మధ్య బంధం ఉందని నమ్మారు. ఎన్నికల్లో జనసేన ఓటమికి ప్రధాన కారణం కూడా అదే. అయితే ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ మనిషేనని పవన్ కల్యాణే నిరూపిస్తున్నారు. రాజధాని వ్యవహారంలో అతిగా స్పందించి  టీడీపీ .. నేను ఒకటేనని సిగ్నల్స్ పంపిస్తున్నారు.


జగన్ చేసిన మంచి పనులు మెచ్చుకోకుండా అదేపనిగా టీడీపీ మాదిరిగా విమర్శలకు దిగుతున్నారు. దీనితో జనసేన ఇంకా ఘోరమైన స్థితిలోకి పోతుంది. ఎన్నికల్లో జనసేన ఓటమితో ఏపీలో జనసేన రేంజ్ ఏంటో తెలిసి పోయింది. చివరికి అధినేత కూడా రెండు చోట్ల ఓడిపోవటంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇన్ని రోజులు ఆ పార్టీని నమ్ముకున్న వాళ్లు ఇంకా ఆ పార్టీని నమ్ముకుని కష్టపడే పరిస్థితిలో ఎవరు లేరని చెప్పాలి. జనసేన దాదాపు అన్ని స్థానాల్లో .. ఏదో కొన్ని స్థానాలు తప్పిస్తే .. డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పటికే 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ కూడా నామ రూపాలు లేకుండా పోయిన పరిస్థితి.



మరింత సమాచారం తెలుసుకోండి: