బొత్స సత్య నారాయణ ఇంకా రాజధాని మీద వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో కొత్త చర్చకు దారి తీస్తున్నారు. నిన్న మీడియా ముందు బొత్స మాట్లాడుతూ రాజధాని పేర్మింనేట్ కాదని కేవలం తాత్కాలికమే నని .. గత ప్రభుత్వం కనీసం గెజిట్ కూడా విడుదల చేయలేదని అలాంటప్పుడు రాజధాని పర్మినెంట్ ఎలా అవుతుందని కొత్త లాజిక్ లు బయటికి తీశారు. ఒక పక్క మిగతా మంత్రులు కూడా రాజధానిని మార్చే ఉద్దేశం లేదని చెబుతుంటే, బొత్స మాత్రం ఈ విషయంలో ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పడంతో మళ్ళీ గందరగొళం నెలకొంటుంది. దీనితో రాష్ట్ర ప్రజలు సహజంగానే ఆందోళనకు గురౌతున్నారు. మరో పక్క నాలుగు రాజధానులు అంటూ కొత్త కాన్సెప్ట్ తెర మీదకు వచ్చింది.


దీనితో అసలేం జరుగుతుందని అందరికీ అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు వాస్తవానికి అమరావతిలో ఏముందంటే ఏమి లేదు. గట్టిగా వర్షం వస్తే వరదలు మాత్రం వస్తాయి. ఐకానిక్ బ్రిడ్జిలు అని .. సింగపూర్ డిజెన్స్ అని ఐదేళ్లు కాలక్షేపణ చేశారు. మధ్యలోకి రాజమోళిని తీసుకొచ్చారు. ఇన్నీ చేసిన బాబు గారు ఇప్పటి వరకు కనీసం క్యాపిటల్ కోర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కూడా కట్టలేకపోయారు.


ఇప్పుడు అక్కడ ఉండేటివి .. అన్నీ తాత్కాలికము. తాత్కాలిక అసెంబ్లీ .. తాత్కాలిక హై కోర్ట్. అయితే బొత్స చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే .. ప్రభుత్వం  రాజధాని మీద చర్చ జరిపిందని మాత్రం అర్ధం అవుతుంది.  అయితే టీడీపీ మాత్రం తామేదో ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించామని దానిని మార్చవద్దని తెగ బాధపడిపోతోంది.  ఎన్నికల ముందు కూడా వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని మారిపోతుందని .. దొనకొండకు తరలిస్తారని చంద్రబాబు ఎన్నికల్లప్పుడు ఆరోపించారు. దాని ద్వారా ప్రజల్లో ఓట్లను పొందాలని చూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: