వినాయక చవితి సందర్భంగా వినాయకులను మండపాల్లో ప్రతిష్టిస్తారు.  పూజలు చేస్తారు.. 9 రోజులపాటు వైభవోపేతంగా విగ్రహాలకు పూజలు జరిపి అనంతరం నిమర్జనం చేస్తారు.  ఈ నిమర్జనం వెనుక చాలా కథ ఉన్నది. ఇప్పుడు ఆ కథ గురించి అనవసరం అనుకోండి.  మెయిన్ పాయింట్ లోకి వెళ్తే.. వినాయకుడి విగ్రహాలను వివిధ ఆకారాల్లో తయారు చేయడం తెలిసిన విషయమే.  వివిధ రూపాయల్లో వినాయకుడిని తయారు చేస్తుంటారు.  ఆ రూపాల్లో వినాయకుడికి పూజలు చేస్తుంటారు. 


వినాయకుడి పక్కన చిన్న చిన్న వినాయకుడి విగ్రహాలు పెడతారుగాని, నాయకుల విగ్రహాలు పెట్టారు.  ఇలాంటివి ఎక్కడా జరగలేదు. తెలంగాణలోని ఆర్మూరులోని ఓ మండపంలో ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.  ఆ మండపాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జీవన్ తన విగ్రహం పక్కన నిలబడి ఫోటో దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  వినాయకుడి విగ్రహం పక్కన నాయకుడి విగ్రహం ఎలా పెడతారని జనాలు ప్రశ్నిస్తున్నారు.  


నాయకుడి విగ్రహం కావాలంటే బయట పెట్టుకోవాలని, ఇలా వినాయకుడి విగ్రహాం పక్కన పెట్టి దేవుడిలా చూడటం బాగాలేదని అంటున్నారు.  ప్రతిపక్షాలు కూడా జనాలకు సపోర్ట్ చేస్తున్నాయి.  దీంతో పాపం మండపం నిర్వాహకులకు ఏం చేయాలో పాలుపోలేదు.  విగ్రహాన్ని అక్కడే ఉంచితే పెద్ద గొడవ జరుగుతుంది.. అక్కడి నుంచి తీసేస్తే నాయకుడి మర్యాద పోతుంది ఏం చేయాలో తోచలేదు.  


ఆర్మూరు నియోజక వర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అందుకే విగ్రహం పెట్టమని అంటున్నారు.  ఇదిలా ఉంటె, అటు యాదాద్రిలోను ఇదే సమయ ఎదురయింది.  యాదాద్రి దేవాలయంలోని మండప శిలలపై కెసిఆర్, ప్రభుత్వ పధకాలను చెక్కడంతో ప్రజానీకం భగ్గుమన్నది.  దేవాలయంలో ఇలాంటి విగ్రహాలు చెక్కడం ఏంటని మండిపడింది.  దీంతో ఆ ప్రతిమలు చెక్కిన స్తంభాలను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: