బాలకృష్ణ హిందూపూర్ నియోజక వర్గం నుంచి తిరిగి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  తెలుగుదేశం పార్టీకి అక్కడ మంచి పట్టు ఉన్నది అని నిరూపించడానికి ఇదొక నిదర్శనం.  రాయలసీమలోని కొన్ని చోట్ల తెలుగుదేశానికి మంచి పట్టు ఉన్నది.  అలాంటి వాటిల్లో హిందూపురం నియోజక వర్గం కూడా ఒకటి. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి హిందూపురంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వస్తున్నది.  


అయితే, ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అక్కడి నుంచి విజయం సాధించారు.  గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి అభివృద్ధి కోసం కొంత ప్రయత్నం చేశారు. కాగా, ఇప్పుడు వైకాపా అధికారంలోకి వచ్చింది.  మరి హిందూపురం నియోజక వర్గం మాటేంటి.. అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందా.. బాలయ్య ఆ నియోజక వర్గాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉన్నది.  


ఇకపోతే, హిందూపురంలో గణపతి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.  ఈ ఉత్సవాల్లో భాగంగా గణపతి విగ్రహాలను నిమర్జనం కోసం నిన్నటి రోజున భారీఎత్తున తరలించారు.  విగ్రహాలను తరలించే సమయంలో బాణాసంచా కాలుస్తూ.. విగ్రహాలను తరలిస్తూ ఉంటారు.  ఇక్కడా అలానే చేశారు.  అలా విగ్రహాలను తరలించే సమయంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. 


విగ్రహాల ముందు బాణాసంచా కాల్చిన సమయంలో అది పొరపాటున గణపతి విగ్రహం పక్కన ఉన్న సింహం బొమ్మకు అంటుకుంది.  వెంటనే మంటలు అంటుకున్నాయి.  అక్కడే ఉన్న వ్యక్తులు స్పందించి.. సింహం బొమ్మకు అంటుకున్న మంటలను ఆర్పారు.  లేదంటే పెద్ద ప్రమాదం జరిగేది. ఊరేగింపుగా వేలాది మంది ప్రజలు తరలి వెళ్తున్న సమయంలో ఇలా జరగడం  ఇబ్బందికరమైన విషయంగా చెప్పాలి.  ముందు జాగ్రత్తగా అలర్ట్ గా ఉండటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. లేదంటే ఘోరం జరిగిపోయేది. 


మరింత సమాచారం తెలుసుకోండి: