రైతులకు అవసరం కన్నా అదనంగా యూరియాను నిల్వ చేస్తున్నామని రాష్ట్ర   వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.  సెప్టెంబర్ 12 వ తేదీ  నాటికి రాష్ట్రంలో 90 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందబాటులో ఉంటుందని మంత్రి స్పష్ట్రం చేశారు. రైతులు యూరియా విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. రాష్ట్రానికి అవసరమైన 90 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పిస్తున్నట్లు చెప్పారు. మరో నాలుగు రోజుల్లో రైతుల వద్దకే పూర్తిస్థాయిలో యూరియా చేర్చుతామని ఆయన స్పష్టం చేశారు. వ్యాపారులు ఎక్కడైనా యూరియా అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతను తీర్చడానకి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందని తెలిపారు. 



హోకా భవనంలో ఆదివారం మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, అడిషనల్ డైరెక్టర్ విజయకుమార్, ఫర్టిలైజర్ ఏడీఏ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖాధికారులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు యూరియా నిల్వలు, సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. యూరియాను రైతుల వద్దకు చేర్చడానికి మండలాల్లో ఉన్న వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. స్టాక్ పాయింట్ వద్ద నుంచి లోడింగ్ వివరాలు తెలుసుకుని రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. 




అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. రైతులకు అవసరమైన యూరియాను గ్రామాలకు చేర్చడానికి వాహనాలను సిద్ధం చేయాలన్నారు. ఇప్పటి వరకు 33800 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామన్నారు. సోమవారం నాటికి 16374 మెట్రిక్ టన్నుల యూరియా రేక్ పాయింట్ల నుండి రవాణా మార్గంలో గ్రామాలకు చేర్చుతామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మరో రెండు రోజుల్లో 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి అవుతుందన్నారు. ఓడ రేవుల ద్వారా మరో 17 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చేస్తోందన్నారు. మరో 14 వేల మెట్రిక్ టన్నుల యూరియా లోడింగ్‌కు సిద్ధంగా ఉందన్నారు. రోడ్డు మార్గాల ద్వారా మరో 8వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందన్నారు.



రాష్ట్రానికి అవసరమైన 90 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రానికి అవసరమైన 90 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పిస్తున్నట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: