తెలంగాణ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కంప్లీట్ అయ్యింది. కొద్ది రోజులుగా హ‌రీష్ చుట్టూ పొలిటిక‌ల్‌గా హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం క్రియేట్ అయ్యింది. అల్లుడు హ‌రీష్‌రావుకు మంత్రిప‌ద‌వి ఇవ్వ‌కుంటే ఎక్క‌డ జారీపోతాడో అనే అనుమానంతో ముంద‌గానే కేసీఆర్ జాగ్ర‌త్త‌ప‌డ్డాడా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. హ‌రీష్ ప్ర‌భావం ఎక్క‌డ పార్టీపై ఉంటుంద‌న్న‌ ఆలోచ‌న‌తో వెంట‌నే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ప‌చ్చ‌జెండా ఊపి... దీనిని ఆఘ‌మేఘాల మీద కంప్లీట్ చేశార‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.


కేసీఆర్ మేన‌ల్లుడు త‌న్నీరు హ‌రీష్‌రావు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలిచిన నేత‌. గ‌త ఎన్నిక‌ల్లో 1.24 ల‌క్ష‌ల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన నేత‌. హ‌రీష్‌రావుకు వ‌చ్చిన‌ మెజారిటీ ఓ రికార్డు. ఇలా రికార్డు సాధించిన హ‌రీష్‌రావుకు మేన‌మామ కేసీఆర్ త‌న మంత్రివ‌ర్గంలో స్థానం ఇవ్వ‌కుండా మొండిచేయి చూపాడు. సామాజిక స‌మీక‌ర‌ణ‌లో భాగంగా వెల‌మ‌ సామాజిక వ‌ర్గానికి చెందిన హ‌రీష్‌రావుకు స్థానం ఇవ్వకుండా అదే సామాజిక వ‌ర్గానికి చెందిన ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుకు మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పించాడు.


గ‌త మంత్రివ‌ర్గంలో వెల‌మ‌ సామాజిక వ‌ర్గానికి చెందిన సీఎంగా కేసీఆర్‌తో పాటుగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన జూప‌ల్లి కృష్ణారావు, హ‌రీష్‌రావు, కేటీఆర్‌ల‌కు స్థానం ఇచ్చాడు. అంటే న‌లుగురు వెల‌మ‌ సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి స్థానం ల‌భించింది. కానీ రెండోసారి అధికారంలోకి రాగానే మాత్రం కేవ‌లం వెల‌మాల సామాజిక వ‌ర్గానికి చెందిన ఎర్ర‌బెల్లికి స్థానం క‌ల్పించి, హ‌రీష్‌రావు, కేటీఆర్‌కు స్థానం ఇవ్వ‌లేదు. అయితే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కేవ‌లం 11 మందికి మాత్ర‌మే స్థానం క‌ల్పించ‌డంతో కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి ఒక‌రికే స్థానం ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని స‌ర్థిచెప్పారు.


కానీ వాస్త‌వానికి హ‌రీష్‌రావును రాజ‌కీయంగా దెబ్బ‌తీసేందుకే ఇలా మొండిచేయి చూపార‌నే అప‌వాదును మూట‌గ‌ట్టుకున్నాడు కేసీఆర్. అదే సంద‌ర్భంలో త‌న కొడుకు కేటీఆర్‌కు మాత్రం పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేసి పెద్ద పీట వేశాడు. కొడుకుకు పెద్ద‌పీట వేసిన కేసీఆర్‌ మేన‌ల్లుడు హ‌రీష్‌రావును పొమ్మ‌న‌లేక పొగ‌బెట్టిన‌ట్లుగా ప్ర‌జ‌లంతా భావించారు. హ‌రీష్‌రావుకు తీర‌ని అన్యాయం చేశాడ‌నే ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కాలం గ‌డుస్తున్న కొద్ది కొడుకు కేటీఆర్‌కు ప్రాధాన్య‌త పెంచుతూ పోయిన కేసీఆర్‌, హ‌రీష్‌రావును మాత్రం నిర్ల‌క్ష్యానికి గురిచేశాడ‌నే గుస‌గుస‌లు వినిపించాయి.


ఇక హ‌రీష్‌రావు ప్రాధాన్య‌త‌ను కూడా రోజు రోజుకు త‌గ్గిస్తూ వ‌చ్చిన కేసీఆర్ చివ‌రికి పార్లమెంట్ ఎన్నిక‌ల‌ప్పుడు కేవ‌లం మెద‌క్ జిల్లాకు మాత్ర‌మే ప‌రిమితం చేశాడు. దీంతో తీవ్రంగా క‌ల‌త చెందిన హ‌రీష్‌రావు స‌మ‌యం కోసం వేచిచూస్తున్న త‌రుణంలో బీజేపీ క‌న్ను హ‌రీష్‌రావుపై ప‌డింది. హ‌రీష్‌రావును బీజేపీలో తీసుకుని తెలంగాణ‌లో బ‌లోపేతం అయి అధికారం హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌నే దిశ‌గా అడుగులు వేస్తున్న త‌రుణంలో కేసీఆర్ అల్లుడు రూపంలో రాబోవు గండాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఆఘ‌మేగాల మీద చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. తెగేదాక లాగితే బాగుండ‌ద‌ని కేసీఆర్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌న మేన‌ల్లుడుతో పాటు, కొడుకు కు స్థానం క‌ల్పించారు. సో మేన‌ల్లుడి దెబ్బ‌కు మేన‌మామ దిగిరాక త‌ప్ప‌లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: