ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాక్ దేశాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గు మంటోంది.  ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియాపై ఎలాగైనా కసి తీర్చుకోవాలని చూస్తున్నది.  ఇండియాపై ఒత్తిడి తీసుకురావాలని అంతర్జాతీయంగా ప్రయత్నించి విఫలం అయ్యింది.  చైనా సహకారం తీసుకున్నా కూడా పెద్దగా లాభం లేకపోయింది.  ఇండియాను  జీహాద్ తరహా ఉగ్రవాదంతోనే ఎదుర్కోవాలని స్వయంగా పాక్ అధ్యక్షుడు చెప్పిన సంగతి తెలిసిందే.  


ఇలా స్వయంగా పాక్ అధ్యక్షుడు చెప్పిన తరువాత అమలు చేయకుండా ఉంటారా చెప్పండి. ఎవరికి తెలియకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలకు ఉగ్రవాదులను రహస్యంగా చేరవేస్తోంది.  వాళ్లకు రక్షణగా సైన్యాన్ని నియమించింది.  అంటే ఈ ఉగ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించి.. ఇండియాలో మారణహోమం సృష్టిస్తే.. కాశ్మీర్ విషయంలో భారత్ అసమర్ధత బయటపడింది అని చెప్పి అంతర్జాతీయంగా డప్పు కొట్టేందుకు సిద్ధం కావొచ్చని పాక్ ఉద్దేశ్యం.  


అయితే, పాక్ వేస్తున్న ప్రతి అడుగును ఇండియా గమనిస్తూనే ఉన్నది.  పాక్ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. ఎప్పటికప్పుడు వారిని అడ్డుకుంటూనే ఉన్నది.  ఇప్పుడు పాక్ రహస్యంగా జైల్లో ఉన్న జైషే లీడర్ మసూద్ ను విడుదల చేసింది.  ఆయన్ను కాశ్మీర్ బోర్డర్ లో ఉన్న జైషే స్థావరాలను పంపేందుకు రెడీ అయ్యింది.  ఐబి ద్వారా ఇండియాకు సమాచారం అందటంతో బోర్డర్ లో సైన్యాన్ని అప్రమత్తం చేసింది.  రాజస్థాన్.. కాశ్మీర్ బోర్డర్ ద్వారా జైషే ఉగ్రవాదులను ఇండియాలోకి చొరబడేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.  


కొన్ని రోజుల క్రితం పాక్ ప్రధాని ఇండియాకు తగిన సమాధానం ఇస్తామని చెప్పడం, అలా చెప్పిన రెండు రోజుల్లోనే జైషే లీడర్ మసూద్ ను రహస్యంగా రిలీజ్ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటో స్పష్టంగా అర్ధం అవుతున్నది. ఇప్పటికే ఇండియా పాక్ లో ఉన్న కొంతంమంది ఉగ్రవాదులపై నిషేధం విధించింది.  అందులో జైషే మహ్మద్ లీడర్ మసూద్ కూడా ఉన్నారు.  ఉగ్రవాదంపై పోరులో అమెరికా కూడా ఇండియాకు సపోర్ట్ చేస్తున్నది. అమెరికా నుంచి సహాయం పొందుతున్న పాక్ మాత్రం ఈ విషయంలో ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్తూనే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: