నేటి నుంచి ఈ నెల పదమూడు వరకూ తెలంగాణ రాష్ట్ర సమావేశాలు జరగనున్నాయి.  ఈ సారి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 2014 లో తెలంగాణ ఏర్పడిన తరువాత అధికారం లోకి వచ్చిన టీఆర్ ఎస్ ప్రభుత్వం లో ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి గా బాధ్యతలు తీసుకున్నారు. రెండు వేల పధ్ధెనిమిది వరకూ ఆయన బడ్జెట్ ప్రవేశ పెడుతూ వచ్చారు. గత డిసెంబర్ లో రెండో సారి టీఆర్ ఎస్ అధికారం లోకి వచ్చాక ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్ తన దగ్గరే పెట్టు కున్నారు ప్రభుత్వం తరపున ఆయనే స్వయం గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 


తాజా గా ఈ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అందుకే హరీశ్ రావుకు ఆర్థిక శాఖను ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న రెండో ఆర్థిక మంత్రి గా చరిత్రకెక్కనున్నారు హరీశ్ రావు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2019-20 ని అసెంబ్లీ లో ముఖ్య మంత్రి కేసీఆర్ మండలి లో మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టబోతున్నారు. ఆదివారం రాత్రి ఈ బడ్జెట్ రాష్ట్ర కేబినేట్ ఆమోదించింది. మొత్తం ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల తో బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిసింది.

 సీఎం కేసీఆర్ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అసెంబ్లీ లో బడ్జెట్ ప్రసంగం చేస్తారు. ఆర్థిక శాఖ హరీశ్ రావు మండలి లో బడ్జెట్ పై ప్రసంగిస్తారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి లో ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్ల తో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అది ఆరు నెలల వరకే వర్తిస్తుంది, అందువల్ల సెప్టెంబర్ ముప్పై తో దాని కాల పరిమితి ముగుస్తుంది.  అందుకే ఇప్పుడు పూర్తి స్థాయి జనరల్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు సీఎం కేసీఆర్ అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న మండలి లో మాత్రం హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశ పెడుతుండటం పైనే రాజకీయ వర్గాల్లో ఎక్కువ గా చర్చ జరుగుతోంది. 

బడ్జెట్ ప్రసంగాని కి ఒక రోజు ముందే హరీశ్ రావు మంత్రిగా ప్రమాణం చేయటం ఆయన కు ఆర్థిక శాఖను అప్పగించడం ఆయన మద్దతుదారుల హర్షాతిరేకాలు నింపింది. ఉమ్మడి రాష్ట్రం లో వైఎస్ ప్రభుత్వం లో క్రీడలు యువజన సర్వీసులు రెండు వేల పద్నాలుగు లో ఏర్పడిన కేసీఆర్ సర్కార్ లు సాగు నీటి పారుదల శాఖలను నిర్వహించిన హరీశ్ రావు తొలిసారి ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వహించబోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: