బీజేపీ అధికారంలో ఉంది కదా అని చేరిపోయి అవినీతి కేసులు మాఫీ చేసుకోవాలని చూస్తే మాత్రం కుదిరే వ్యవహారం కాదని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు కుండబద్దలుకొట్టారు. బీజేపీ ఎవరినీ రక్షిందని, ఎవరి  అవినీతి కేసుల బాధ వారే పడాలని కూడా ఆయన అన్నారు. ఒకవేళ ఎవరైనా బీజేపీ అండ ఉంటుందని భావిస్తే మాత్రం అది పూర్తిగా తప్పు అన్నారు.


విశాఖలో పర్యటించిన మురళీధరరావు ఈ రోజు మీడియాతో మాట్లాదుతూ బీజేపీ ఎవరినీ కాపాడదు అన్నది అంతా గుర్తుంచుకోవాలని చెప్పారు. పార్టీ మారితే కేసులు పోతాయని అనుకున్న వారు పూర్తిగా అమాయకులేనని ఆయన సెటైర్లు వేశారు. అవినీతి చేసి కాపాడండి అంటే బీజేపీ అసలు సహకరించే పనే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇదిలా ఉండగా రాజకీయం వేరు, కేసులు వేరు అని ఆయన చెప్పుకొచ్చారు. మా పార్టీలోకి ఎవరైన సిధ్ధాంతాలు నచ్చి చేరితే స్వాగతిస్తామని, అయితే వారు అవినెతిపరులని తేలితేమాత్రం కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.


ఇక  ఎవరో వచ్చి చేరినా బీజేపీ డీ ఎన్ ఏ మారదని, పార్టీలో చేరివారు ఎంతటివారైనా బీజేపీ సిధ్ధాంతాలను గౌరవించాల్సిందేనని, మా బాటలో నడవాల్సిందేనని ఆయన చెప్పుకొచ్చారు. ఓ విధంగా ఆయన ఏపీలో తాజాగా చేరిన కొత్త పూజారులకు హెచ్చరికగా ఈ మాటలు అని ఉంటారని భావిస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరి రెచ్చిపోతున్న వారి విషయంలో మురళీధరరావు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారని కూడా అంటున్నారు. కేసులను మాఫీ చేసుకోవడం, పాత పార్టీకి వూతమిమీచ్చేలా స్టేట్మెంట్లు ఇస్తూ అసలు బీజేపీని గందరగోళంలో పెట్టడం వంటివి చూసే ఆయన ఈ రకమైన ప్రకటన చేశారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే మురళీధరరావు మాటలు బీజీపీలో కొత్త వేషం కట్టిన వారికి మింగుడుపడకపోవచ్చునని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: