కొన్ని రోజుల క్రితం దేశంలో డీజీల్, పెట్రోల్, బంగారం ధరలు కొండెక్కాయి.  బండి బయటకు తీసి వెళ్లి వస్తే వంద ఖర్చు.  ఇంట్లో అందరి కలిసి బయటకు వెళ్లడానికి కారు తీస్తే వెయ్యికి పైగా ఖర్చు.. ఇక ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగి బంగారం కొనాలి అంటే ఒంట్లో ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి.  ఇలా ఒకటేమిటి అన్ని పెరిగిపోయాయి.  అవన్నీ పెరిగిన రోజుల్లో ఆర్ధిక మాద్యం లేదు.  జీడీపీ రేటు స్థిరంగా ఉన్నది.  


అయితే, కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చింది.  అప్పట్లో బండి బయటకు తీస్తే పెట్రోల్ ఖర్చుకు భయపడేవాళ్లు.. ఇప్పుడు చలానా ఖర్చులకు భయపడాల్సి వస్తోంది.  హెల్మెట్ తో పాటు అన్ని కరెక్ట్ గా ఉంటేనే బండి ముందుకు కదులుతుంది.  లేదంటే బండి కొనేందుకు ఎంత ఖర్చు చేశారో.. ఆ స్థాయిలో చలానాలు కట్టాల్సి వస్తుంది.  అయితే, చలానాలు కట్టకుండా ఉండాలి అంటే.. నిబంధనలకు అనుగుణంగా అన్ని కరెక్ట్ గా ఉండాలి.  ఇది మన సేఫ్టీ కోసమే అని ప్రభుత్వం చెప్తున్నది.  


ఇదిలా ఉంటె గత కొన్ని రోజులుగా దేశంలో జీడీపీ రేటు కనిష్టంగా నమోదైంది.  5% వృద్ధి రేటును నమోదు చేసుకోవడంతో కేంద్రం అప్రమత్తమైంది.  దేశంలో ఆర్థికమాద్యం పడగవిప్పుతున్న సమయంలో దాన్ని ఎదుర్కొనడానికి కేంద్రం సిద్ధం అయ్యింది.  ధరలను తగ్గించడం వలన లేదంటే ధరలను పెంచడం వలన ఆర్థికమాద్యం నుంచి బయటపడే వీలుండదు.  కాబట్టి.. ఈ మాధ్యం నుంచి బయటపడాలి అంటే.. ముందు ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేయాలి.  


అప్పుడే జీడీపీ వృద్ధి చెందుతుంది.  ఆర్ధికమాధ్యం నుంచి బయటపడుతుంది.  వీలైనంత త్వరగా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి జీడీపీని వృద్ధి చేసే విధంగా చూస్తేనే తిరిగి అభివృద్ధి పరుగులు తీస్తుంది. లేదంటే మాత్రం అభివృద్ధి తిరోగమనంలో పయనించే అవకాశం ఉంటుంది.  కొన్ని రోజుల క్రితం వరకు ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఇప్పుడు దిగి వస్తున్నాయి.  ఇది సంతోషించదగిన విషయమే.  ఇదే విధంగా జీడీపీ కూడా తిరిగి 8శాతానికి చేరుకుంటే.. ఇండియా అనుకున్నట్టుగా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఇండియా చేరుకుంటుంది అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: