ట్రాఫిక్ కొత్త చట్టం పేరుతో జరిమానాలు విధించి ప్రజలను పీక్కు తింటున్నారని ఇప్పటికే ప్రజలు విరుచుకు పడుతున్నారు. గత 9 రోజుల నుంచి జరిమాణాలపై విరుచుకు పడుతూ కొన్ని మార్పులు చెయ్యాలని ప్రజలు ఇప్పటికే కోరుతున్నారు. ఈ చట్టం రావడంతో వాహనదారులకు ఇప్పట్లో ఉపశమనం కల్గించేలా లేవు. అయితే ఈ కొత్త రూల్స్ కాకా మరో కొత్త రూల్ ని తెరపైకి తీసుకొచ్చారు. 


బైక్ నడిపేటప్పుడు వాహనదారులు స్లిప్పర్స్ వంటివి వాడకూడదట. ఈ రూల్‌ను నిర్లక్ష్యం చేసి చెప్పులేసుకుని డ్రైవింగ్ చేస్తే ఒకేసారి వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాలట. ఇలా ఫైన్ మాత్రమే కాదు మొదటిసారి చెప్పుల్లేకుండా డ్రైవింగ్ చేస్తే వెయ్యి రూపాయలు అదే రెండో సారి కూడా చేస్తే 15రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందేనట.        


అయితే నవభారత్ టైమ్స్ ఆగష్టులో తెలిపిన వివరాల ప్రకారం ఈ రూల్ ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో తప్పనిసరిగా పాటించాలని నిబంధనలు విధించడం లేదని తెలిపింది. ప్రస్తుతానికి ఈ నియమాన్ని అధికారులు అమలు చేయకపోయినా త్వరలో ఇదికూడా వస్తుందని అనుకుంటున్నారు. ట్రాఫిక్ నియమాల ప్రకారంగా చెప్పులు లేదా స్లిప్పర్స్ వేసుకుని టూవీర్స్ నడపడం నేరం కిందకు వస్తుందని వార్తలు వస్తున్నాయి.              


ఈ నిబంధన కూడా వాహనదారుని భద్రత కోసమే చట్టంలో పొందుపరిచారని సమాచారం. అయితే ఈ వార్తలపై ప్రజలు స్పందిస్తూ 'మా భద్రత ఏంటో కానీ మా జాబులు మాత్రం బాగా కాళీ చేస్తున్నారని' అంటున్నారు. మరికొందరు స్పందిస్తూ ''ఇదేం రూల్ రా బాబు.. పిచ్చ మీకు అంటూ కామెంట్లు పెడుతున్నారు''. ఏది ఏమైనా ఈ రూల్ వాళ్ళ భద్రత కంటే రోగాలే ఎక్కువ వస్తాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: