జగన్ తన పాలనలో అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా పరిపాలన అందించాలని అనుకుంటున్నారు. దానికనుగుణంగా గత ప్రభుత్వం చేసిన ఏ చిన్న అవినీతిని సహించడం లేదు. పీపీఏల ఒప్పందమే తీసుకుంటే అడుగడుగునా కేంద్రం అడ్డం పడుతుంది. జగన్ తప్పుడు సమాచారం ఇస్తున్నాడని చివరికి కేంద్రం కూడా జగన్ మీద ఎదురు దాడికి దిగుతుంది. అసలు పీపీఏల ఒప్పందంలో అవినీతి జరిగిందో లేదో తెలియాలంటే ముందు పునః సమీక్ష జరగాలి కదా ! ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా తన తండ్రి పాలనను ప్రజలకు అందించాలని జగన్ మొదటి రోజు నుంచి దానికి తగ్గట్టు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ జగన్ ఒక అనుకుంటే మరొకటి జరుగుతుంది.


అడుగడుగునా కేంద్రం ప్రభుత్వం నుంచి ప్రతి పక్షాల వరకు గగ్గోలు పెడుతున్నాయి. పీపీఏ ఒప్పందాల రద్దు, మధ్యపాన నిషేధం, నిరుద్యోగులకు సచివాలయాలు ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్ ను మార్చే పధకాలు. కానీ ఇందుకు ప్రతి పక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. పీపీఏల రద్దు అనేది రాష్ట్ర ప్రజల మీద అదనపు భారం మోపకూడదని జగన్ భావించారు. ఏపీ ప్రభుత్వం డిస్కం లకు 18,500 కోట్లు బకాయిలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా యూనిట్ విద్యుత్ ధర సుమారు రూ 5.50  పైగా కొనుగోలు చేయడంతో రాష్ట్రం మీద అప్పు కుప్పలుగా వచ్చి చేరింది. నిజానికి పక్క రాష్ట్రాల్లో  రూ.2 నుంచి రూ. 3 ఉంటే .. ఏపీలో మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దీనితో జగన్ తప్పని పరిస్థితిలో పీపీఏల పునః సమీక్షకు పట్టు బడుతున్నారు. 


ఇదిఇలాగే కొనసాగితే  ఏపీ ఆర్ధిక పరిస్థితి కుప్ప కూలే పరిస్థితిలోకి వస్తుంది. అందుకే జగన్ తక్కువ ఖర్చుకే విద్యుత్ ను కొనుగోలు చేస్తే డబ్బులు మిగిలిపోతాయని .. లేకపోతే పెరిగిన బకాయిలు ప్రజల మీద విద్యుత్ చార్జీల రూపంలో మోపాల్సిన పరిస్థితి వస్తుంది.  కానీ జగన్ అందుకు సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితిలో ప్రజల మీద విద్యుత్ భారం పడకూడదని .. జగన్ పీపీఏల సమీక్ష చేసి తక్కువకే  విద్యుత్ ను కొనుగోలు చేయాలనీ జగన్ నిర్ణయించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: