ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం దక్షిణ భారతదేశంలో ఉగ్రవాద దాడులు పొంచి ఉన్నాయి అని భారత సైన్యం సోమవారం ధృవీకరించింది. అలాంటి ప్రయత్నాలను విఫలం చేయడానికి భారత్ సైన్యం అన్ని జాగ్రత్తలు తీసుకొంటుంటి అని ఆర్మీ తెలియజేసింది. కేరళ రాష్ట్రంలో బుధవారం నాడు అతిపెద్ద వేడుక అయిన ఓనం జరుపుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఆర్మీ నుండి ఈ హెచ్చరిక వచ్చింది.

"భారతదేశం  దక్షిణ భాగంలో ఉగ్రవాద దాడి జరగవచ్చు అనే  సమాచారం ఆర్మీకి అందింది. పాకిస్తాన్ భారత్ బార్డర్ సర్ క్రీక్ నుండి వచ్చిన కొన్ని  పడవలు ఆర్మీ స్వాధీనం చేసుకొంది. అందులో 5 మృతదేహాలను భారత సైన్యం కనుగొంది.  శత్రువులకి  సంబంధించిన ఉగ్రవాదుల దాడులు జరగకుండా తగు జాగ్రత్తలను ఇండియన్ ఆర్మీ తీసుకొంటుంది." అని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ నుంచి వచ్చిన సమాచారం ద్వారా ఆర్మీ సదరన్ కమాండ్, జనరల్ ఆఫీసర్, కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్.కె.సైని పేర్కొన్నారు.

బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి రద్దీ ప్రాంతాల్లో గట్టి భద్రత కల్పించాలని కేరళ పోలీసు చీఫ్ లోకనాథ్ బెహెరా అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను కోరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముప్పును దృష్టిలో ఉంచుకుని మెరుగైన సామర్థ్యం పెంపొందించేలా మరియు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సర్ క్రీక్ ప్రాంతంలో చర్యలు చేపట్టినట్లు ఆర్మీ తెలిపింది.

పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు కచ్ ప్రాంతం ద్వారా భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేయవచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో గుజరాత్ పోలీసులకు హెచ్చరిక జారీ చేసిన కొద్దీ రోజుల వ్యవధిలోనే ఈ తాజా హెచ్చరిక వచ్చింది. ఈ నేపధ్యం‌ లో‌ దక్షిణ  రాష్ట్రా ప్రభుత్వాలు  చాలా అప్రమత్తం‌గా ఉండాలని,  తగు చర్యలు తీసుకోవాలని ఆర్మీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: