తెలంగాణ అసెంబ్లీలో సీట్ల కేటాయింపు ఒక్కసారిగా మారిపోయింది. ఇన్నాళ్లూ ప్రధాన ప్రతి పక్ష హోదాలో స్పీకర్ కు ఎడమవైపు సీట్లలో కాంగ్రెస్ సభ్యులు కూర్చునేవారు. ఇప్పుడు కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఆరుకు పడిపోయింది. ఎంఐఎంకు మాత్రం ఏడుగురు సభ్యులున్నారు. దీంతో స్పీకర్ కు ఎడమవైపు ఉన్న సీట్లలో ఎంఐఎం సభ్యులు కూర్చున్నారు. కాంగ్రెస్ సభ్యులు మాత్రం మరో చోటుకు మారారు.



మొత్తం కాంగ్రెస్ కు పంతొమ్మిది మంది సభ్యులుంటే అందులో ఎంపీగా గెలిచిన ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.దీంతో పధ్ధెనిమిదికి ఆ పార్టీ బలం పడిపోయింది. మరోవైపు పన్నెండు మంది సభ్యులు తమను టిఆర్ ఎస్ ఎల్పీలో విలీనం చేయాలంటూ లేఖ ఇవ్వడంతో ఆ ప్రక్రియ జరిగిపోయింది. కాబట్టే కాంగ్రెస్ బలం ఆరు కు పడిపోయింది. దానివల్ల కాంగ్రెస్ సభ్యుల సీట్లు మారిపోయాయి .



పార్లమెంటు నిబంధనలు, పార్లమెంటు సాంప్రదాయంను అనుసరించి ఎక్కడైన అసెంబ్లీలో కానీ ఏ రాష్ట్ర అసెంబ్లీలోనైన, పార్లమెంట్ లోనైనా స్పీకర్ ముఖానికి ఉన్నటువంటి కుడివైపున పూర్తిగ అధికార పక్షం ఉంటుంది .ఎడమవైపున ప్రతిపక్షం ఉంటుంది . అది కూడా ప్రధాన ప్రతిపక్షం ఉంటుంది . ఆ తర్వాత ప్రతిపక్షానికి, అధికార పక్షానికి మధ్యలో ఉన్న బెంచెస్ లో ఆ తర్వాత స్థానాలలో ఉన్నటువంటి పార్టీలు చిన్న చిన్న పార్టీలు లేదంటే.



ఆ తర్వాత సంఖ్యలో ఉన్నటువంటి పార్టీలన్నీ వరుసగా ఉంటాయి. ఇంతకు ముందు 19 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రధాన ప్రతి పక్ష హోదాలో ఉండి భట్టి విక్రమార్క ఇప్పటికీ కూడా సిఎంసి లీడర్ గా కొనసాగుతూ ఉన్నారు. కానీ అందులో నుంచి పన్నెండు మంది టీఆర్ ఎస్ లో విలీనం అవుతున్నట్టుగా స్పీకర్ కు లేఖ రాశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: