దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్ర దాడులు జరిగే  అవకాశం ఉందని భారత సైన్యం హెచ్చరించింది.  అందులో భాగంగా భారీ విధ్వంసానికి   ఉగ్ర వాదులు కుట్ర పన్నుతున్నారని  ఈమేరకు  నిఘా వర్గాల నుండి  సమాచారం వచ్చిందని  ఆర్మీ కమాండర్  లెఫ్టినెంట్ జర్నల్ ఎస్ కె సైనీ మీడియాకు వెల్లడించారు.  దక్షిణభారతంలోని పలు  రాష్ట్రాల్లో ఉగ్ర వాదులు విధ్వసం కు పాల్పడే   సూచనలు ఉన్నాయని తమకు సమాచారం అందిందని  గుజరాత్ లోని సర్‌క్రిక్ ప్రాంతంలో గుర్తు తెలియని పడవలు కనిపించడంతో ఉగ్రవాదులే  ఈ పడవలను   వదిలేసి వెళ్ళివుంటారని సైనీ అనుమానాలు వ్యక్తం చేశారు.



అయితే ఆ బోట్లల్లో వచ్చింది  ఉగ్రవాదులా కదా  అని గుర్తించాల్సి ఉందని ముందు జాగ్రత్తగా  ఈమేరకు  తీర ప్రాంతాల్లో  భద్రత ను మరింత కట్టుదిట్టం చేశామని సైనీ అన్నారు.  సైన్యం ఈ  ఇన్ఫర్మేషన్ ను  కేంద్ర హోం శాఖ కు చేరవేయడం తో  తీర ప్రాంతాల్లో గుర్తు తెలియని పడవులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల డీజీపీలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది.  దాంతో  కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది.  కాగా  ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో  కేరళ సర్కార్  అలర్ట్ అయ్యింది. ఓనం పర్వదినం సందర్బంగా  ఎలాంటి  అవాంఛనీయ ఘటనలు  జరుగకుండా పోలీస్ యంత్రంగా  అప్రమత్తమైంది.  అందులో భాగంగా విమానాశ్రయాలు , బస్టాండ్లు , రైల్వే స్టేషన్ లలో భద్రతను  కట్టుదిట్టం చేశారు. 


ఇక దక్షిణాది  రాష్ట్రాలను హెచ్చరించడం  ఇది మొదటిసారి కాదు. ఇటీవల  తమిళనాడులో కి  ఉగ్రవాదులు  చొరబడ్డారని  దాంతో  దక్షిణాది రాష్ట్రాల్లో  దాడులు జరిగే అవకాశముందని ఐబీ హెచ్చరించింది. ఆ హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడులో అప్పటినుండి హై అలర్ట్ కొనసాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: