రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని సిఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లోపించిందన్నారు. గత నాలుగేళ్ల గ్రోత్ రేటు కాంగ్రెస్ ప్రభుత్వ ఫలితమన్నారు, కేసీఆర్ పరిపాలన ఫలితాలు ఇప్పుడే మొదలయ్యాయి అని భట్టి తెలియజేసారు.  బడ్జెట్ ప్రసంగంలో హామీల ఊసే లేదని భట్టి విమర్శించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాలని అమ్మటం సరికాదన్నారు. మియాపూర్ లోని ఎనిమిది వందల యాభై ఎకరాలలో పేదవాళ్లకు డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టాలని భట్టి డిమాండ్ చేశారు.


కె చంద్రశేఖర రావు గారు ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ముఖ్యంగా ఏమి లేనట్టు వంటి బడ్జెట్ గా ఉంది. ఎన్నికల సందర్భంలో కెసిఆర్ గారు అనేక రకాలైన తప్పుడు వాగ్ధానాలు చేసి, వాటిని అమలుచేసేటప్పుడు చేతులే ఎత్తేయడం దారుణం అన్నారు. రాష్ట్ర ప్రజలంతా వాగ్దానాలు అమలు చేసే బడ్జెట్ కోసం ఎదురుచూస్తూ ఉంటే ఈ బడ్జెట్ లో అవి ఏమి లేవు అనే విషయం చాలా స్పష్టంగా కన్పిస్తోంది అని చెప్పారు.

అసలు ఆయన పరిపాలన ఫలితాలు ఐదు సంవత్సరాల తరువాత మొదలవడం చాలా హాస్యాస్పదం అని చెప్పారు. సాదరంగా ఐదు సంసత్సరాల పాలనా తరువాత కొని ఫలితాలు కంపించాలి కానీ అవి ఏమి కంపించలేదు అని, అవి ఇప్పుడే మొదలవడం ప్రభుత్వాన్ని అనుమానించాల్సిన పరిస్థితి మొదలైంది అని తెలిపారు.  ఇప్పుడు మొదలైన పాలనా ద్వారా రాష్ట్రంలో ఎంత తేడా కనిపిస్తుంది అంటే కెసిఆర్ పరిపాలన వల్ల రాష్ట్ర  రాబడి మరియు రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎంతగానో నష్టపోయింది అని తెలియజేసారు.

అంతిమంగా ఈ బడ్జెట్ ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు యాభై ఏడు వయస్సు ఉన్నవారికి పెన్షన్,  డబల్ బెడ్ రూం ఇళ్లు, ప్రతీ ఒక్కరికి మూడు ఎకరాల భూమి  విషయంలో డబ్బుల్లేవని చేతులేత్తిసింది అని తెలిపారు. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తాం వాటితో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్నట్టుండి విలువైన భూముల్ని అమ్మకానికి పెట్టి పదివేలకోట్ల  తీసుకొస్తాం అని చెప్పడం చాలా అనుమానుషం అని తెలియజేసారు. హైదరాబాదు నగరంలో ఉన్నట్టు వంటి భూములన్నీ కూడా ఈ రాష్ట్ర సంపద, అది భవిష్యత్ తరాల వారికి కావాలి అని వాటిని తాకట్టు పెట్టవద్దు అని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: