జగన్ ముఖ్యమంత్రిగా  తక్కువ కాలంలోనే  సంచలన నిర్ణయాలు తీసుకుంటూ  తన మార్క్ పాలనతో ప్రశంసలు అందుకుంటున్నాడనేది  ఒక కోణం అయితే, మరో కోణంలో మాత్రం జగన్ పై రోజురోజుకి  విమర్శలు పెరుగుతున్నాయి.  ముఖ్యంగా జగన్ ఇచ్చిన హామీలు  అమలు పర్చలేనివి అని  టీడీపీ మండిపడుతుంటే, మరోవైపు జగన్ పై  ఎక్కువుగా అంచనాలు పెట్టుకున్న  ప్రజలు కూడా పూర్తిగా నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ హయాంలో దారుణాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా  'వైసీపీ నేతల  బెదిరింపులతో సొంత ఊళ్లు వదిలేసి పరాయి గ్రామాల్లో కొంతమంది ప్రజలు తలదాచుకుంటున్నారని.. పైగా ప్రజలను  పంట పొలాల్లోకి కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారని.. దాని కోసం రోడ్లకు అడ్డంగా గోడలు కూడా కడుతున్నారని.. పైగా ఎస్సీలు, ముస్లిం మైనారిటీల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని..  అలాగే కొంతమంది  రైతుల  బోర్లు పూడ్చేయడం, పైపులు కోసేయడం లాంటివి చేస్తున్నారని..  ఇలా జగన్ ను, జగన్ పార్టీని టీడీపీ వాళ్ళు నిత్యం తీవ్రంగానే విమర్శిస్తూ వస్తున్నారు.   దానికి తగ్గట్లుగానే  ఇసుక మీద ఆధారపడ్డ కార్మికులు, ఐదు రూపాయిల భోజనం కోరుకున్నే  నిరుపేద కుంటుంబాలు మాత్రం జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.          


ఇలాంటి పరిస్థితిల్లో జగన్  హామీల పై  ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది. అప్పుడే వస్తున్న ఆరోపణలకు బ్రేక్ లు  పడతాయి.  పైగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కూడా జగన్ ప్రజలకు నమ్మకం కలిగించాడు.  ఇప్పుడేమో ప్రత్యేక హోదా గురించి అసలు  ప్రస్తావనే లేదు. పైగా హోదా ఇవ్వమని బీజేపీ స్పష్టంగా చెప్పుకొస్తోంది. అయినా జగన్ మాత్రం  ప్రత్యేక హోదా విషయంలో ఏమి మాట్లాడట్లేదు.  హోదా కోసం ఏం చెయ్యబోతున్నాడనేది జగన్ చెప్పాలి.  అలాగే రాజధాని నిర్మాణం విషయంలో కూడా జగన్ ఖచ్చితమైన స్పష్టత ఇవ్వాలి.  ఎన్ని సంవత్సరాల్లో రాజధానిని నిర్మిస్తాడనేది కూడా క్లారిటీగా ప్రజలకు చెప్పాలి.  ఇక అన్నిటికి కన్నా..  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రంగాల వారికి ఇచ్చిన హామీలను కూడా వెంటనే అమలు పరచాలి. ఇంకా  చెప్పుకుంటే పొతే అవినీతి నిర్మూలన. వృద్దులు మూడు వేల పెన్షన్  ఇలాంటి  కీలకమైన హామీలను నెరవేర్చికపోతే  జగన్ పై ఇంకా వ్యతిరేఖత పెరుగుతొంది. ఇప్పటికైనా జగన్ మేలుకుంటే మంచింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: