మంగాయమ్మ వారం రోజుల క్రితం ఈ పేరు ఎవరికి తెలీదు. ఈమె గురించి ఏ మాత్రం తెలీదు. కానీ ఇప్పుడు అందరికి తెలుసు. మాతృత్వం తీపి తీర్చుకునేందుకు 74 ఏళ్ళు ఆమె శ్రమించింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962లో వివాహం కాగా, ఏళ్ల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా పిల్లలు కలగలేదు.             


వయసు 74 ఏళ్ళు వచ్చిన ఆమెకు తల్లి కావాలనే కోరికా బలంగా ఉంది. ఆ సమయంలోనే సరిగ్గా ఓ మహిళా 55 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ విధానంలో బిడ్డకు జన్మనివ్వడంతో మంగాయమ్మలో ఆశలు చిగురించాయి. దీంతో గత ఏడాది అహల్య ఆసుపత్రిను సంప్రదించారు.దీంతో ఈ దంపతులు ఇద్దరు ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చారు.                                


అయితే ఈ విషయాలు తెలుసుకున్న వైద్య  సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అసిస్టెడ్‌ రీప్రొడెక్టివ్‌ టెక్నాలజీ ర్యేగులేషన్ బిల్లు-2017 ప్రకారం 18 ఏళ్ల లోపు.. 45 ఏళ్ల పైబడిన వారికీ ఈ చికిత్స అందిచడం నిషేధం అని పేర్కొన్నారు. ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ అసిస్టెడ్‌ రీప్రొడక్షన్‌, ఇండియన్‌ ఫెర్టిలిటీ సొసైటీ రీప్రొడక్షన్‌ తదితర సంఘాల అధ్యక్షులు వ్యాఖ్యానించారు.


అయితే ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతోనే ఐవీఎఫ్ విధానం చికిత్స ప్రారంభించారని అహల్య ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. సెప్టెంబరు 5న మంగాయ్మకు శస్త్రచికిత్స నిర్వహించగా, కవలలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు, అయినప్పటికి మంగాయమ్మ ఇంకా ఐసియులోనే చికిత్స పొందుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: