వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి 100 రోజుల పాలన తుగ్లక్‌ పాలనలా... ఆయన మంత్రివర్గం పిచ్చితుగ్లక్‌  దర్బారులా తయారైందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని, మమ్మల్ని ఎందుకు తుగ్లక్‌తో పొల్చుతున్నారో తెలియక వైసీపీ శ్రేణులు తెగ గింజుకుంటున్నారని, జగన్‌ తుగ్లక్‌ చర్యలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే జగన్‌ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఒక ఛార్జీషీట్‌ విడుదల చేయడం జరిగిందని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. 


ఇప్పటికైన ప్రభుత్వం కల్లు తెరిచి వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. సోమవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి దగ్గర నుండి సామాన్య ప్రజల వరకు తినే బియ్యం ఒకేలా ఉండాలని, సన్నబియ్యం పంపిణీ చేస్తానని ప్రచారం చేసిన జగన్మోహన్‌రెడ్డి... అధికారంలోకి వచ్చిన అనంతరం ముక్కిపోయిన బియ్యం పంపిణీ చేసి నాణ్యమైన బియ్యం ఇవేనని చెప్పడం పిచ్చితుగ్లక్‌ పాలనను తలపిస్తోందన్నారు. ప్రతి పేదవాడికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు చెక్క బియ్యం పంపిణీ చేయడం దారుణమని ఇది తుగ్లక్‌ చర్య కాదా? అని ఆమె ప్రశ్నించారు. 




తమ హయాంలో మద్యపాన నిషేధం దశలవారిగా చేపడతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం బడ్జెట్లో రూ.2,700 కోట్ల వరకు ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు, ఎక్సైజ్‌ పోలీసులచే నేరుగా మద్యం అమ్మకాలు చేపట్టడం తుగ్లక్‌కు పరిపాలనకు నిదర్శనం కాదా? అని నిలదీశారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న మహిళకు రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కన్పించకపోవడం బాధాకరమన్నారు. ఈ మధ్యకాలంలో దాదాపు 2,195 మంది మహిళలు అదృశ్యమైతే హోంమంత్రి తనకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని, హోంమంత్రి సొంత జిల్లాలో 235 మంది మహిళలు అదృశ్యమైతే ఎందుకు పట్టనట్లు వ్యహరిస్తున్నారని అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. 


సాక్షాత్తు హోంమంత్రి సొంత మండలంలోని పొనుగుపాడు గ్రామంలో కొందరు వైసీపీ కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి తెలుగుదేశం కార్యకర్తలపై దాడికి పాల్పడుతుంటే ఇప్పటి వరకు గోడ తీయించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే తుగ్లక్‌ పరిపాలన కాక మరేంటని నిలదీశారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని పదే పదే పాదయాత్రలో ప్రకటనలు చేసిన జగన్‌... అధికారంలోకి వచ్చిన అనంతరం కృతిమ ఇసుక కొరత సృష్టించి దాదాపు 20 లక్షల మంది కార్మికుల్ని రోడ్డున పడేశారని అన్నారు.  గిరిజనులకు పౌష్టికాహారం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆహార బుట్టలను పంపిణీ చేస్తే, వైసీపీ ప్రభుత్వం ఉన్న ఆహార బట్టలను పంపిణీ చేయడం చేతకాక దాదాపు రూ.36 కోట్లు విలువ చేసే గిరిజనుల పౌష్టికాహారాన్ని కుళ్లబెట్టడం ఇది తుగ్లక్‌ పాలన కాదా? అని అన్నారు. రైతులను ఉద్ధరిస్తానని జగన్‌ అధికారంలోకి వచ్చారని, రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని మొదట ప్రకటించి, ఇప్పుడు కేవలం 6,500లు మాత్రమే ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు. 


ఇచ్చే ఆ రూ.6500లు కూడా ఎప్పుడు ఇస్తారో కూడా ప్రభుత్వం చెప్పలేని స్థితిలో ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఇప్పటికే 149 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, బాధ్యతగల ముఖ్యమంత్రి అన్నదాతల ఆత్మహత్యలపై కనీసం సమీక్షలు చేయకపోవడం తుగ్లక్‌ చర్య కాదా? అని అనురాధ నిలదీశారు. గోదావరి, కృష్ణా నదులకు వరదలు వస్తే కనీసం జగన్మోహన్‌రెడ్డి క్షేత్రస్ధాయిలో పర్యటించలేదని, రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు అని అన్నారు. అనంతపురంలో 25 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారిని పరామర్శించే స్థితిలో ఈ రోజు ప్రభుత్వం లేకపోవడాన్ని తగ్లక్‌ పాలన కాక ఏమనాలని ఆమె నిలదీశారు. ఈ రోజు గ్రామాల్లో వైసీపీ దాడులకు భయపడి బాధితులు ఉన్న గ్రామాలను వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం... బాధితుల్ని ఆదుకోవడాన్ని వదిలి పోటిగా వైసీపీ నికిలి శిబిరాన్ని ఏర్పాటు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. 



వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నికిలి శిబిరాలికు  హోంమంత్రి వత్తాసు పలకడం తుగ్లక్‌ చర్య కాదా? అని అన్నారు. పేదలకు కడపు నింపే అన్న క్యాంటీన్లును సైతం రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం తుగ్లక్‌ చర్య అని, అన్న క్యాంటీన్ల ద్వారా ఆదాయం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి మాట్లాడటం నీచమని అనురాధ నిప్పులు చెరిగారు. పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టలేని ప్రభుత్వాన్ని తుగ్లక్‌ పరిపాలన అని అనకుండా ఎలా ఉండగలమని అన్నారు. ప్రతి వర్గానికి న్యాయం చేస్తామని చెప్పిన జగన్‌... బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయింపులు తగ్గించడాన్ని తుగ్లక్‌ చర్య కాదా? 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో ఘనంగా చట్టం చేసిన ప్రభుత్వం ఒక్క ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వారికి నామినేషన్‌ పదవులు కేటాయించారా? ఇది తుగ్లక్‌ పాలన కాదా? టీడీపీ హయాంలో ఒక్క నిరుద్యోగికి కూడా టీడీపీ ప్రభుత్వం ఉద్యోగం కల్పించలేదని ద్రుష్పచారం చేసిన వైసీపీ నాయకులు అసెంబ్లీలో మాత్రం ఐదు లక్షల ఉద్యోగాలు గత ప్రభుత్వం కల్పించిందని ప్రకటన చేయడాన్ని తుగ్లక్‌ చర్యగా మేం అభివర్ణించడం ఏవిధంగా తప్పు అవుతుందని? అన్నారు. 


నిరుద్యోగభృతిని రద్దు చేయడంతో పాటు వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పించేందుకు ఉన్న ఉద్యోగుల్ని రోడ్డున పడేస్తున్నారని అన్నారు. యువత, మహిళ, రైతు, కార్మికులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలా ఏవర్గంలోనూ సంతోషం లేదన్నారు. కాబట్టే మేం తుగ్లక్‌ పరిపాలన చేస్తున్నారని అనడంలో ఎటువంటి తప్పులేదన్నారు. జగన్‌ తుగ్లక్‌ పాలన చేస్తున్నారు కాబట్టే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నా ఆయనకు తెలియడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. గతంలో జగన్‌ మాదిరిగానే రాజధాని మార్చే ప్రయత్నం చేసిన వ్యక్తికి తుగ్లక్‌ అనే పేరు వచ్చిందని, ఇప్పుడు ఆ పేరును జగన్‌ సార్థకం చేసుకుంటున్నారని అన్నారు. అవినీతి పాలన అందించడమే మాధ్యేమని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి నేరుగా చెప్పడం తుగ్లక్‌ పరిపాలన గుర్తు చేస్తున్నట్లుగా ఉందని అనురాధ అన్నారు. త్వరలోనే ఈ తుగ్లక్‌ పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడతారని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: