నిన్న మొన్న‌టి వ‌ర‌కు వారు అదికారంలో ఉన్నారు. రెండో సారి కూడా అదికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నిం చినా.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. దీంతో వారు ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మ‌య్యారు. అయితే, ఇప్పుడు కూడా అది కారంలో ఉన్న‌ట్టే ఫీల‌వుతుండ‌డంతో టీడీపీ నాయ‌కుల ప‌రిస్థితి చిత్రంగా క‌నిపిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపి స్తున్నాయి. టీడీపీ అదికారంలో ఉండ‌గా.. ప్ర‌తిప‌క్షాల‌ను ప‌ట్టించుకున్న‌ది లేదు. క‌నీసం వారి స‌ల‌హాలు, సూ చన‌ల‌ను కూడా వినే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది. త‌మ‌ను మించి రాజ‌కీయాలు ఎవ‌రు చేయ‌గ‌ల‌రు? అనే విధంగా వారు చెల‌రేగిపోయారు.


ఈ క్ర‌మంలోనే ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై దాడులు కూడా జ‌రిగాయి. అనేక కేసులు కూడా బ‌నాయించారు. ఇక‌, ఏ నిర‌స‌న చేప‌ట్టినా.. పోలీస్ యాక్ట్‌ను అడ్డు పెట్టుకుని అడ్డుకున్నారు. ఏకంగా విప‌క్ష నాయ‌కుడిని కూడా నిర‌స‌న చేప‌ట్టేందుకు అంగీక‌రించ‌లేదు. ఈ ప‌రిణామాలు ఇంకా ఏపీ ప్ర‌జ‌ల క‌ళ్ల‌ల్లో క‌నిపిస్తున్నాయి. కానీ, టీడీపీ నాయ‌కులు మాత్రం మ‌రిచిపోయారు. త‌మ‌కు అధికార పార్టీ టార్గెట్ చేస్తోంద‌ని క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. అంతేకాదు,  త‌మ‌ను వేధిస్తున్నార‌ని, కేసులు పెడుతున్నార‌ని వాపోతున్నారు.


తాజాగా ఇదే విష‌యంపై ప్ర‌కాశం జిల్లా కొండ‌పి టీడీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ డోలా బాల వీరాంజ‌నేయ స్వామి మాట్లాడారు.  ‘‘నేను ఫిర్యాదు చేస్తే కేసు రిజిస్టర్‌ చేశారు. చర్యలు తీసుకోలేదు. అదే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కేసులో ఏదో జరిగిపోయినట్లు ఆగమేఘాలపై స్పందించారు. న్యాయం అందరికీ సమానం కాదా!’’ అని స్వామి ప్ర శ్నించారు. దీనిపైనే నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. స్వామికి ఇంకా రాజ‌కీయాలు ఒంట బ‌ట్ట‌లేదా ? అని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. అధికారంలోనే ఉన్నామ‌ని ఆయ‌న అనుకుంటున్నారా? అంటూ .. నెటిజ న్లు స‌టైర్లు పేలుస్తున్నారు.


బాబు హ‌యాంలో క‌నీసం నిర‌స‌న అనే మాట వినిపిస్తే.. పోలీసులు రంగంలోకి దిగి.. నోరు మూయించిన సంద‌ర్భాల‌ను ఫొటోల‌తో స‌హా షేర్ చేస్తున్నారు. ఇప్పుడు క‌నీసం ధ‌ర్నాలు రాస్తారోకోలు చేసేందుకు అవ‌కావం అయినా ఉంటోంద‌ని, ఈ విష‌యం స్వామి గ‌మ‌నించాల‌ని చుర‌క‌లు అంటిస్తున్నారు. మ‌రి టీడీపీ నేత‌లు ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరుస్తారో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: