డెబ్బై నాలుగేళ్ల బామ్మా గర్భిణి కావడం అందులో ఆమె డెలివరీకి సంబంధించిన న్యూస్ గురించి కూడా చాలా మంది చాలా రకాలుగా చెప్పుకొంటున్నారు. కొంతమందేమో ఈ వయసులో ఎందుకు అని ఎగతాళి చేయడం జరిగింది. డెబ్బై నాలుగు ఏళ్ల వయసులోనూ ఎలాగైనా బిడ్డను కనడం ద్వారా తాను తల్లి అని నిరూపించుకోవాలనే తపనతో చేసిన పని అది. ఇంత వయసులో ఇలా చేయడం  ఒక హాస్పిటల్ తప్పిదం  వల్ల జరిగింది అని  వైద్య పరిభాషలో ఒక సంస్థ లేఖ రాయడంతో బయటకు వచ్చింది.


దేశవ్యాప్తంగా ఉన్నట్టు వంటి కొన్ని వైద్యానికి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలలో రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ 2017 చాప్టర్ 4 పేరా 37 ప్రకారం ఈ విధమైన  వైద్య పద్దతి అప్లై చేయకూడదు అని, ఈ పద్దతి తప్పు అని జాతీయ వైద్యో భాగాలకు సంబంధించినటువంటి ఐఎస్ సీఏఆర్, ఐఎఫ్ ఎస్ ఏసీ సంఘాల ప్రతినిధులు లేఖ రాశారు.

చట్ట ప్రకారం ఇలాంటి కండిషన్స్ లో ఉన్న వృద్ధిరాలికి కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే పంపించాల్సిన బాధ్యత ఆస్పత్రికి ఉంది అని తెలియజేశాయి. అయితే ఈ చట్టం ఇంకా ఆచరణలోకి రాలేదు కానీ లోక్ సభలో ఆమోదం చేశారు. రాజ్య సభలో ఆమోదించే లోపు దానిని అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటు చేయమని ఆదేశించింది. తర్వాత ప్రభుత్వం మారడంతో అది పార్లమెంట్ లోనే ఆగిపోయింది.

ఆ చట్టం ఆచరణలోకి వస్తే 74 వయస్సులో డెలివరీ చేయించడం హాస్పిటల్ తప్పుగా భావించేది. హాస్పిటల్ ప్రచారం కోసం ఈ రకమైన ప్రచారం చేసుకోవడం కూడా ఆస్పత్రుల వాళ్ళ తప్పుగా భావించాలి. ఇకనైనా వాళ్ళు ఈ రకమైన ప్రచారాన్ని ఆపేస్తే మంచిది అని ఈ సంఘాలు కోరుకుంటున్నాయి. అలాగే ఆ కుటుంబం పై ఎటువంటి ట్రోల్స్ చేయకుండా ఉండాలి అని కోరుకున్నాయి సంఘాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: