శుభ్రత అనేది మనిషి జీవితంలో ఎంత ముఖ్యమంటే అది లేకుంటే జనం కుక్కకంటే హీనంగా,పంది కంటే దారుణంగా చూస్తారు.పొద్దున లేచింది మొదలు శుభ్రత కోసం గంటలు గంటలు కెటాయించేవారున్నారు.అపరిశుభ్రంగా వుండి ఎవరి ప్రక్కనైన నిలబడితే అతని చూపులో ఛీదరింపు కనబడుద్ది.ఇక ఒకరోజు స్నానం చేయకుంటే ఒళ్లంతా అనీజిగా అనిపించడమే కాదు.ఓ రకమైన స్మెల్ వస్తుంది.అలాంటిది,60 ఏళ్లు అంటే మాట‌లా అస‌లు అన్ని ఏళ్ల పాటు స్నానం చేయ‌కుండా ఎవ‌రైనా ఉంటారా.నిజంగా అలాంటివారు ఉంటేగ‌న‌క వారివ‌ద్ద‌కు వెళ్లాలంటేనే ఎవ‌రైనా సాహ‌సం చేయాలి.ఎందుకంటే కోటానుకోట్ల బాక్టీరియాలు ఆ వ్యక్తి చుట్టూ ఉంటాయి.



దీంతో ఆ వాతావ‌ర‌ణంలో ఉండే గాలిని పీల్చినాచాలు,వ్యాధులు వెంటనే వ‌చ్చేస్తాయి. అందుకే అలాంటి వ్యక్తికి ఓ కిలోమీటర్ దూరంలో వున్న తక్కువే అనిపిస్తుంది.వాటర్ లేకుంటే కొనుక్కునైన స్నానంచేసే ఈ రోజుల్లో అన్నేళ్లపాటు స్నానంచేయ‌ని వ్య‌క్తి ఉన్నారా..అంటే..అవును..ఉన్నారు అనే సమాధానంవస్తుంది.అతనెక్కడుంటాడో తెలుసుకోవాలనిపిస్తుంది కదూ..అయితే అది మ‌న దేశంలో కాదులెండి.అత‌ని పేరు అమౌ హ‌జి.ఇతను చాలా నిర్మానుష్యంగా వున్న ప్రాంతంలో ఒక చిన్న గ‌దిలో ఒక్క‌డే ఉంటాడు.ఇత‌ను 60 సంవ‌త్స‌రాల నుంచి స్నానం చేయ‌లేద‌ట‌.దీంతో అతని శ‌రీరం అంతా కాల్చిన బొగ్గులా తయారై దుమ్ము,ధూళి క‌మ్ముకుని జుట్టు అట్ట‌లు క‌ట్టుకుని ఉంటుందట.ఇంత అసహ్యంగా కనిపించే ఇత‌ను ఏం తింటాడో,ఏం తిన‌డో ఎవ్వరికి తెలియ‌దు కానీ పొగ మాత్రం తాగుతాడు.అది కూడా జంతువుల మ‌లాన్ని ఎండ‌బెట్టి పొడి చేసి దాన్నిపైప్‌లో వేసుకుని తాగేస్తాడు.



ఇతని చుట్టూ నిర్మానుష్య వాతావ‌ర‌ణం.ఓ చిన్న గ‌దిలో నివాసం.అందులో బోర్ కొడితే మాత్రం అప్పుడప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తాడు.ఆసమయంలో దారిన వెళ్లే జనాలు ఇతన్ని అసలు పలకరించను కూడా పలకరించరట.ఇతను ఎక్కడినుండి వచ్చాడో ఎవ్వరికి తెలియదట చాల అరుదుగా బయట కనిపించే ఇతన్ని ఇటీవలే ఎవ‌రో ఫొటోలు తీయ‌డం తో ఈ వ్య‌క్తి గురించిన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.దీంతో అస‌లు ఇత‌ను ఎవ‌రు  అని ఇప్పుడు అక్క‌డి వారు ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు.మ‌రి వారికి స‌మాధానం దొరుకుతుందో,లేదో వేచి చూడాలి..! 

మరింత సమాచారం తెలుసుకోండి: