ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలనలకు మారు పేరు. రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ సంచలన నిర్ణయాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒకొక్కటి నెరవేరుస్తూ పాలన ప్రారంభించిన 100 రోజుల్లోనే మంచి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నాడు.               


ఈ తరహాలోనే పేదల కోసం సన్న బియ్యం పంపిణి ప్రారంభించాడు. అయితే అందులో తడిసిన బియ్యం ఉన్నాయి అని ఇవేనా మీ సన్న బియ్యం అంటూ ప్రతిపక్ష నేతలు ప్రశ్నించడం మొదలెట్టారు. మొదట పాలకపక్షం చేసే మంచి భరించలేక బురదజల్లుతున్నారని అందరూ భావించినప్పటికీ పాలకపక్షం పంపిణి చేసిన బియ్యం తడిసిన బియ్యమే అని అర్థం అయ్యింది.                               


దీంతో శ్రీకాకుళం జిల్లాలో తడిసిన బియ్యం పంపిణీపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద 15 వేల మంది వాలంటీర్లు బియ్యం పంపిణీ చేశారని, 9 లక్షల బస్తాల్లో 30 బస్తాలు తడిసిన బియ్యం పొరబాటున సరఫరా అయ్యాయని, తడిసిన బియ్యం సరఫరా గుర్తించి వెంటనే బస్తాలు మార్చి పంపిణీ చేశారని, ఇప్పటికే 100 శాతం నాణ్యమైన బియ్యం పంపిణీ చేశాం ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.                               


వివరణ అనంతరం వైసీపీ ప్రభుత్వం నాణ్యమైన బియ్యం సరఫరా చేయడాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వంపై పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, బురదజల్లడం ఆపాలని దృష్ప్రచారం చేసే వారికీ సూచించారు. మరి ప్రభుత్వం ఇచ్చిన వివరణ విని అయినా తప్పుడు ప్రచారాలు చెయ్యడం ఆపుతారు ఏమో చూడాలి.                          


మరింత సమాచారం తెలుసుకోండి: