ఆకాశాన్ని తాకాలని ఆమె కల చివరికి నెరవేర్చుకుంది. ఇది ఒడిషాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మల్కాన్ గిరి జిల్లాకు చెందిన ఇరవై మూడేళ్ల అనుప్రియ లక్రా పైలెట్ అయి చరిత్ర సృష్టించింది. కమర్షియల్ విమానాన్ని నడిపిన తొలి ఆదివాసీ మహిళా పైలెట్ గా అనుప్రియా అరుదైన ఘనత సాధించింది.

చిన్నప్పట్నుంచి పైలెట్ కావాలని కలలు కన్న అనుప్రియ రెండు వేల పన్నెండులో ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి పైలెట్ ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమయ్యారు. అందులో ఉత్తీర్ణత సాధించి భువనేశ్వర్ లోని పైలెట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో చేరిన అనుప్రియ ఏడేళ్లు కష్టపడి ఇటీవలే ఓ ప్రైవేటు విమానశ్రయ సంస్థలు కో పైలెట్ గా ఉద్యోగం సాధించింది.


అంకితభావం, అనుకున్నది సాధించాలనే పట్టుదల ద్వారా తాను సాధించిన ఈ అరుదైన ఘనతకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అనుప్రియ లక్రాను అభినందించారు. మరి కొంతమంది  ఈ ఘనతను సాదించడానికి ఈమె ఒక ఉదాహరణగా నిలుస్తుందని కొనియాడారు. అనుప్రియ తండ్రి  ఎస్ లక్రా ఒడిశా పోలీసు విభాగాల్లో హవల్దార్ గా పనిచేస్తున్నారు,  ఆమె తల్లి గృహిణి. అనుప్రియ మల్కంగిరిలోని ఒక కాన్వెంట్,  సెమిలిగుడలోని ఒక పాఠశాల నుండి ఉన్నత చదువుని పూర్తి  చేసింది.  తమ కుమార్తె ఈ ఘనత సాధించడం పట్ల అనుప్రియ తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్కాన్ గిరి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింద ని అనుప్రియ పై దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


"మల్కన్‌గిరి వంటి వెనుకబడిన జిల్లాకు చెందిన ఒక మహిళా సాధించిన ఘన విజయం, ఏడు సంవత్సరాల కృషి తర్వాత ఆమెను  ఈ విజయం వరించింది" అని ఆమె తండ్రి అన్నారు. అనుప్రియా విజయంపై సంతోషించిన ఆమె తల్లి "నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది మల్కన్‌గిరి ప్రజలకు గర్వకారణం. ఆమె విజయం ఇతర అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది" అని అన్నారు. తన కలలు నిరవేరడానికి  ప్రయత్నాలు చేయమని అనుప్రియను ఎప్పుడూ ప్రోత్సహించామని ఆమె తల్లి తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: