సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరు చలానా కట్టాల్సిందే.  రూల్స్ ను అతిక్రమిస్తే జరిమానాను తప్పనిసరిగా కట్టాలి.  లేదంటే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.  ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు కేంద్రం హెచ్చరించింది.  వాహనాల భద్రతా.. చట్టాలను గౌరవించడం.. తప్పు చేయకుండా ప్రతి ఒక్కరు తమ భాధ్యతను నిర్వర్తిచడం కోసమే చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నట్టు గడ్కారీ పేర్కొన్నారు.  


అయితే, ఇటీవలే ముంబైలో అయన ప్రయాణిస్తున్న కారు పరిమితికి మించిన వేగంతో ప్రయాణం చేసింది.  దీంతో అక్కడి పోలీస్ అధికారులు నితిన్ గడ్కారీ కారుకు ఫైన్ వేశారు.  ఆ ఫైన్ కూడా భారీ మొత్తంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఈ విషయాన్ని గడ్కారీ స్వయంగా మీడియాతో పేర్కొన్నారు. ఒకేసారి చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఆ చట్టం కింద ప్రతి ఒక్కరు పనిచేయాలని అన్నారు.  


ఎవరూ మినహాయింపుకాదని చెప్పారు.  తప్పు ఎవరు చేసినా తప్పే.. తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే.  ఫైన్ కట్టాల్సిందే. అందుకే తాను కూడా ఫైన్ కట్టానని చెప్పారు.  ఫైన్ విషయంలో తమ రూలు మారదని చెప్పారు.  కొన్నిరోజులపాటు వీటిని పాటించడం కష్టంగానే ఉండొచ్చు.  కానీ, తరువాత ఆ కష్టం ఉండదని, మన దగ్గర నిబంధనలకు సంబంధించిన అన్ని కరెక్ట్ గా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం రాదనీ అన్నారు.  


ఒకసారి నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం మొదలుపెడితే.. మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది.  తలెత్తుకొని బయట తిరగడగలుగుతాం.  ఒక్క వాహన చట్టం మాత్రమే కాదు.. దేశం ప్రవేశపెట్టిన చట్టాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి.  చట్టాలను అతిక్రమించకుండా ఫాలో కావాలి.  అప్పుడే దేశం పురోగమిస్తుంది.  ప్రపంచ దేశాలతో సమానంగా ఎదుగుతుంది.  అలసత్వం ప్రదర్శిస్తే.. దేశం అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: