2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని ప్రధానంగా దెబ్బ తీసిన వాటిల్లో ఒకటి గ్లోబల్ ప్రచారం. అబద్దాన్ని నిజం చేయడం .. దానికి పచ్చ మీడియా అబ్బో ఓహో అంటూ డప్పు కొట్టడం. పూర్తి చేయని హామీలను 90 శాతం పూర్తి చేశామని చెప్పడం ఇవన్నీ ప్రజలకు చిరాకు తెప్పించాయి. ప్రజలను ఎలాగైనా మోసం చేసి మీడియా అండతో ఎన్నికలో బాబు గారు గెలవాలని ప్లాన్ చేశారు. కానీ చివరికి 30 ఏళ్లలో ఎన్నడూ చూడని పరాజయాన్ని చవి చూశారు. గత ఐదేళ్లలో పరిపాలనలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన ప్రతి పక్షమైన వైస్సార్సీపీని బలహీన పరచడానికి రాజకీయ వ్యభిచారం చేశాడని చెప్పాలి. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.


దీనితో టీడీపీ ఇంకా బలపడిందని బాబు సంబరపడిపోయారు. కానీ ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు కదా ! అన్నీ గమనించి జగన్ కు కనీ వినీ ఎరుగని రీతిలో బ్రహ్మాండలైన మెజారిటీని ఇచ్చి బాబుకు గుణపాఠం నేర్పారు. ఫిరాయించిన నేతల వల్ల ఉపయోగం లేదని .. చివరికి ప్రజలు ఛీ కొడతారని చంద్రబాబు అనుభవం పసిగట్టలేకపోయింది. అబద్దపు హామీలు .. చేతిలో మీడియా ఇవన్నీ తనను రక్షిస్తాయని బాబు ఆశపడ్డారు. కానీ ప్రజలను తక్కువ అంచనా వేస్తే ఎటువంటి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందో .. చంద్రబాబుకు క్లియర్ గా అర్ధం అయ్యింది. 


అయితే టిప్ అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయించిన నేతలు కూడా చంద్రబాబుకు మొహం చాటేశారు. ముఖ్యంగా ఆది నారాయణ రెడ్డి పేరు చెప్పుకోవచ్చు. ఇప్పుడేమో ఆది అసలు ఎక్కడ కనిపించడం లేదు. చంద్రబాబు ఇచ్చిన మంత్రి పదవి కోసం వచ్చారు. ఇప్పుడు అధికారం పోయేసరికి బాబును వదిలేశారు. అలాగే ఎన్నికలో పోటీ చేయకపోయిన నెల్లూరు నారాయణకు మంత్రి పదవి ఇచ్చి అందలం ఎక్కించారు. కానీ నారాయణ ఇప్పుడేమో వైసీపీ మీద అసలు విమర్శలు చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీ ఓకె అంటే దూకేందుకు సిద్ధంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: