ప్రకృతి అంటే శివుడు.. శివుడు అంటే ప్రకృతి అందుకే ప్రకృతినీ కాపాడేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు శివుడితో సమానమే.   ఏదైనా తేడా వస్తే ఆ ప్రకృతే వికృతిగా మారి విలయతాండవం చేస్తుంది. అందరిని హరించివేస్తుంది.  ఇప్పుడు జరుగుతున్నది అదే.  ప్రకృతిని చాలా వరకు చేజేతులా నాశనం చేసుకుంటున్నాం.  మనకు నచ్చిన పనుల కోసం పచ్చని చెట్లను కొట్టేస్తున్నాం. అడవులను నాశనం చేస్తున్నాం.  ఫలితంగా భవిష్యత్ తరాలకు వినాశనాన్ని మిగులుస్తున్నాం.  


అడవులను ఇష్టం వచ్చినట్టుగా నరికేయడం వలన వరదలు వస్తున్నాయి.  వరదలను ఆపేందుకు చెట్లు ఎంతో సహకరిస్తాయి.  కానీ, ఇప్పుడు చెట్లు లేకపోవడంతో.. వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తోంది.  ఊర్లను ముంచెత్తుతోంది.  ఇక్కడే కాదు.. ఎక్కడ చెట్లు కొట్టేసిన ఇదే గతి పడుతుంది.  అందులో డౌట్ లేదు.  దానికో పెద్ద ఉదాహరణ అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు.  ప్రపంచానికి ఊపిరిత్తుల వంటి అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు రగులుకోవడం వలన ఎంతటి నష్టం వాటిల్లిందో చెప్పక్కర్లేదు.  


అందుకే ఇటీవల కాలంలో ప్రకృతిని రక్షించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు.  అలాంటి వాళ్లలో ఒకరు తీరువన్వెలీలోని వీరవనలూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్యాంసన్.  అయన ప్రకృతి ప్రేమికుడు.  సాధుజంతువులనే కాదు.. విష సర్పాలకు కూడా ఆయనంటే ఎంతో గౌరవం ఉన్నది.  వీరవనలూర్ లో ఎక్కడ పాములు కనిపించినా.. ఇన్స్పెక్టర్ శ్యాంసన్ కు ఫోన్ చేస్తారు. 


ఇటీవలే చెట్టుపై ఓ పాము ఉన్న సంగతి గమనించిన జనం వెంటనే ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేశారు.  హుటాహుటిన అయన అక్కడకు వచ్చారు.  వచ్చి చెట్టుపై ఉన్న ఆ పామును పట్టుకొని మేడలో వేసుకున్నారు.  అది ఆయన్ను ఏమి అనలేదు.  పైగా ఆ పాము అతని తలపైకి ఎక్కి పడగవిప్పింది.  దీంతో అందరు షాక్ అయ్యారు.  ఆ సమయంలో శివుడు పోలీస్ గెటప్ వేసుకొని వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు శ్యాంసన్.  దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టాడు.  చెట్ల విషయంలో కూడా ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు.  చెట్లకు ఎవరైనా మేకులు కొడితే వాటిని తొలగింది.. ఆ ప్లేస్ లో పక్షుల కోసం గూళ్ళు కట్టిస్తుంటాడు.  చెట్లను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తుంటాడు.  ఆయనకు వీరవనలూర్ లో జంతుప్రేమికుడిగా మంచి పేరు వచ్చింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: