వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత నిర్ణయాలు వరసగా తీసుకుంటున్నారు.  ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే దాదాపు 4 లక్షల ఉద్యోగాలకు శ్రీకారం చుట్టారు.  గ్రామాల్లో గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు కల్పించారు.  దాదాపు 2.50 లక్షల మంది ఈ వాలంటీర్ ఉద్యోగాల్లో చేరిపోయారు.  


ఇప్పుడు గ్రామ సచివాలయ పోస్టింగుల కోసం ఇటీవల రాత పరీక్షలు జరిగాయి.  త్వరలోనే రిజల్ట్ ను ప్రకటించి అక్టోబర్ 2 నుంచి వారి పోస్టింగ్ లు షూరూ కాబోతున్నాయి.  మొత్తానికి జగన్ చెప్పినట్టుగా చేసుకుంటూ పోస్తున్నారు.  ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రమే కాదు.. అటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, మద్యపాన నిషేధం అమలు, రైతులకు రుణాలు, ఇళ్ల పంపిణి, పింఛన్ విధానం అన్నింట్లోనూ జగన్ చురుకైన పాత్రను పోషిస్తున్నారు.  


పోలవరం టెండర్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం గిర్రున ఉన్నది.  రివర్స్ టెండర్లు విషయంలో కోర్టు కొన్ని సూచనలు ఇచ్చింది.  రివర్స్ టెండర్లను ఆపేయాలని పేర్కొంది.  అటు కేంద్రం కూడా రివర్స్ టెండర్ విధానాన్ని పక్కన పెట్టి పోలవరం పూర్తి చేయలని పేర్కొన్నది.  జగన్ మాత్రం రివర్స్ టెండర్ విధానంవైపు మొగ్గు చూపుతున్నాడు.   


దీంతో కేంద్రం రెండు వారల క్రితం లేఖ రాసింది.  రివర్స్ టెండర్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న  విధానాలపై స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నది.  దీనిపై జగన్ ఇంతవరకు ఎలాంటి జవాబు రాయలేదు.  దీంతో కేంద్రం ఈ విషయంలో జగన్ పై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. రెండో రోజుల్లోగా జగన్ ప్రభుత్వం పోలవరం రివర్స్ టెండర్లు విధానంపై సమాధానం ఇవ్వాలని మరోసారి కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.  మరి దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.  రివర్స్‌ టెండరింగ్‌పై ప్రాజెక్ట్ అథారిటీ విముఖత ప్రదర్శించినా.. ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లడంతో కేంద్రం వివరణ కోరింది. ఈ నిర్ణయం వెనుక కారణంపై నివేదిక కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పీఎంవో లేఖ రాసిన సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: