జూన్ 22 వ తేదీన మార్క్ 3 రాకెట్ చంద్రయాన్ 2 ను మోసుకొని గగన వీధుల్లోకి పరుగులు తీసింది.  అప్పటి నుంచి చంద్రయాన్ 2 ప్రతి అడుగు సవ్యంగానే పడింది.  ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదు. ప్రతి స్టేజిని విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ఆఖరి దశ వరకు వచ్చింది.  ఆఖరి దశలోనూ ఇండియా విజయవంతం అయ్యింది.  మరో 60 సెకన్ల వ్యవధిలో ల్యాండ్ కావాల్సి ఉండగా చంద్రునికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా విక్రమ్ నుంచి సిగ్నల్స్ తెగిపోయాయి.  


సిగ్నల్స్ తెగిపోవడంతో.. విక్రమ్ కూలిపోయిందని.. అందరు అనుమానం వ్యక్తం చేశారు.  ప్రపంచ దేశాలు కొన్ని ఈ విషయంలో వ్యంగంగా మాట్లాడాయి.  అయితే, ఆర్బిటర్ తన పని తాను చేసుకుంటూ పోతూ.. విక్రమ్ జాడను తెలియజేసింది.  విక్రమ్ సేఫ్ గా ఉన్నట్టు తెలిపింది.  అయితే హార్ట్ ల్యాండింగ్ అయ్యిందని.  ఒక పక్కకు మాత్రమే ఒరిగిందని చెప్పింది.  దీంతో ఇస్రోలో సంతోషాలు వెల్లువెత్తాయి.  


విక్రమ్ తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తున్నది.  ఈ నెల 20 వ తేదీ వరకు మాత్రం విక్రమ్ పనిచేస్తుంది.  ఈలోగా విక్రమ్ లో సంకేతాలు పునరుద్దరించగలిగితే.. కొంతవరకు సక్సెస్ అయినట్టే.. ఎలాగైనా ఆ ప్రయత్నం దిశగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.  జాబిల్లిపై దిగిన విక్రమ్ లో తిరిగి సంకేతాలు ఇవ్వాలని ప్రయత్ ఒక్కరు కోరుకుంటున్నారు.  దీనిపై నాగపూర్ పోలీసులు భలే తమాషాగా స్పందించారు.  దీన్ని సెప్టెంబర్1 వ తేదీ నుంచి దేశంలో అమలులోకి వచ్చిన మోటార్ యాక్ట్ ను అనుసంధానం చేశారు.  


"డియర్ విక్రమ్, దయచేసి స్పందించు. సిగ్నళ్లు బ్రేక్ చేశావని నీకు చలానా వేయం’’ అని పేర్కొన్నారు నాగపూర్ పోలీసులు. దీంతో ఈ ట్వీట్ నెటిజనులకు బాగా నచ్చేసింది. ఇప్పటివరకు 10 వేల మందికి పైగా రిట్వీట్ చేసుకోగా 36 వేల మంది లైక్ చేశారు.  దీనిపై నెటిజన్లు కూడా అదే రేంజ్ లో స్పందించారు.  చంద్ర మండలం మీ పరిధిలో లేదని, అక్కడ మీరు ఫైన్ వేయడం కుదరదని అంటున్నారు. ఇంకొందరు.. ‘‘ఒక వేళ విక్రమ్ సిగ్నళ్లు అందుకుని అందుబాటులోకి వస్తే.. దానికి వేయాలనుకున్న ఫైన్ నాకు వేయండి, చెల్లించేస్తా’’ అంటూ కొందరు స్పందిస్తున్నారు. ఏదైతేనేం.. ఇస్రో అంశం కరెంట్ టాపిక్ గా మారిపోయింది.  ఇస్రో జోలికి ఎవరు వెళ్లినా నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: