విశాఖపట్నం కేంద్రంగా జరిగిన భూ కుంభకోణంపై పునర్విచారణ జరిపించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. భూకుంభకోణంపై సిట్ తో విచారణ జరిపించాలని జగన్ నిర్ణయించటం చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ అనే చెప్పాలి. హుద హుద్ తుపాను ముసుగులో అప్పట్లో వేలాది ఎకరాలను టిడిపి నేతలు దోచుకునేసిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది.

 

 చంద్రబాబు సిఎం అయిన కొత్తల్లో హుద్ హుద్ తుపునా దెబ్బకు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రెవిన్యు రికార్డులు గల్లంతయ్యాయి. దాంతో అధికారులు కొత్తగా రికార్డులను తయారు చేయాల్సొచ్చింది. దాన్ని ఆధారం  చేసుకుని చాలామంది టిడిపి ముఖ్యులు వేలాది ఎకరాలను సొంతం చేసేసుకున్నారు. అలా దోచేసుకున్న వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఎంఎల్ఏలు అనిత, బండారు శ్రీనివాసరావు, పీలా గోవింద్ తదితరులున్నట్లు విపరీతమైన ఆరోపణలున్నాయి.

 

ఈ భూ కుంభకోణాన్ని బయటపెట్టిందే మాజీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు. రాజు ఆరోపణలతో ఒక్కసారిగా జిల్లాలో కలకలం రేగింది. చివరకు అది పెద్ద వివాదంగా మారటంతో చంద్రబాబు దర్యాప్తు కోసం సిట్ ను నియమించారు. సిట్ విచారణకు హాజరైన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు భూకుంభకోణంలో గంటా తదితరుల పాత్రపై  ఆధారాలను అందించారు. దాంతో ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా సంచలనమైంది.

 

సరే ఎవరెన్ని ఆధారాలను ఇచ్చినా, సిట్ ఎంత కాలం విచారణ జరిపినా చివరకు నివేదికనైతే చంద్రబాబు బయటపెట్టలేదు. ఎన్ని డిమాండ్లు వచ్చిన ఆ విషయమై చంద్రబాబు లెక్కచేయలేదు. ఇపుడదే అంశాన్ని జగన్ మళ్ళీ బయటకు తీస్తున్నారు. అప్పట్లో జరిగిన భూ కుంభకోణంపై మళ్ళీ సిట్ తో విచారణ జరిపించాలని డిసైడ్ అయ్యారు.  సిట్  విచారణ అంటే జగన్ ఎలాగూ ఎంత కాలంలో విచారణ జరపాలో జగన్ నిర్ణయిస్తారు. దాంతో కుంభకోణంలో ప్రధాన పాత్రదారులెవరు ? సూత్రదారులెవరు ? అన్న విషయాలు వెలుగు చూస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: