మొహరం పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.  దాదాపు పది రోజులపాటు ఈ పండుగ జరుగుతుంది.  మొహర్రం నెల పదో రోజున పీర్లను ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సమయంలో పెద్దఎత్తున హజ్రత్ ఇమాం హుస్సేన్‌కు గుర్తుగా ప్రతిమలను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో తొలిమాసం మొహరం నెల.  ఈ పేరుమీదనే మొహరం పండుగ వచ్చింది.  


మహ్మద్ ప్రవక్త మరణించిన తరువాత.. అయన బాటలో  హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ , హజ్రత్ అలీ, హజ్రత్ ఉమర్ సైతం నడిచారు.  ఆ తరువాత వచ్చిన మావియా చక్రవర్తి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టారు.  ఆ తరువాత వచ్సిన యాజిత్ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్నారు.  రాక్షస పాలన సాగించాడు.  చెడు అలవాట్లకు బానిస అయ్యాడు.  ప్రజలను పీక్కు తిన్నాడు.  


అతడి దురాగతాల్ని హజ్రత్ హుస్సేన్ ఎదురించి ప్రజల పక్షాన నిలిచాడు. శాంతి కోసం హుస్సేన్ చేసిన ప్రతిపాదనల్ని యజీద్ తోసిపుచ్చి యుద్ధం ప్రకటించాడు.  ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మొహరం నెల ప్రారంభం అయ్యింది.  ప్రారంభమైన మొదటి రోజు  ఇరాక్‌లో కర్బలా మైదానంలో యుద్ధం ప్రారంభమైంది. యజీద్ సైన్యం హుస్సేన్‌తోపాటు కుటుంబసభ్యులను చిత్ర హింసలకు గురిచేసి, మహిళలు, పసిపిల్లలను సైతం పాశవికంగా హతమార్చింది. మొహర్రం నెల 10వ రోజు సాయంత్రం నమాజ్ చేస్తున్న సమయంలో ఇమాం హుస్సేన్‌ను శత్రుసైన్యం చుట్టుముట్టి హతమార్చింది.  తలను నరికి ఆ తలను ఊరేగింపుగా తీసుకెళ్లి విజయోత్సవం జరుపుకున్నారు.  


శత్రువుల చేతుల్లో దాదాపు 70 మంది వరకు మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వ్యక్తులు మరణించారు.  దీంతో హజ్రత్ హుస్సేన్ ఆ తెగకు శాపం పెడతాడు.    తెగకు ఎప్పటికీ మోక్షం ఇవ్వొద్దని అల్లాహ్‌ను ప్రార్ధిస్తూ ప్రాణాలు విడుస్తాడు. దీంతో పశ్చాత్తాపం చెందిన వారి కుటుంబ సభ్యులు క్షమించమని వేడుకుంటూ గుండెలపై బాదుకుంటూ.. నిప్పులపై నడుస్తారు. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతూనే ఆనంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: