ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్ర్రైవర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైతే సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడుపుతారో వారికి పది వేల రుపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీని అమలుచేస్తున్నారు. ఈరోజు నుండి ఆన్ లైన్లో ధరఖాస్తులు స్వీకరించనున్నారు. 
 
ఈరోజు నుండి అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ధరఖాస్తు చేయటానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు మరియు రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్లు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. 10 వేల రుపాయల ఆర్థిక సాయం పొందటానికి అర్హులైన డ్రైవర్లు లైసెన్సుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలని తెలుస్తుంది. 
 
15 రోజులలోగా నిర్దిష్టమైన ఖాతాను తెరవటంతో పాటు రవాణాశాఖ వెబ్ సైట్ డేటా బేస్ లో ప్రక్తియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దిష్టమైన ఖాతాను తెరవటం కొరకు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు గ్రామ, వార్డ్ వాలంటీర్లు సహాయం చేస్తారని తెలుస్తోంది. ధరఖాస్తులను కలెక్టర్లు సంబంధిత గ్రామ సచివాలయాలు, మున్సిపాలిటీలకు పంపిస్తారు. ధరఖాస్తుల పరిశీలన అనంతరం అధికారులు సంబంధిత డేటాబేస్ పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు. 
 
పది వేల రుపాయల ఆర్థిక సాయం పొందాలంటే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ సొంతంగా నడుపుకుంటూ ఉండాలి. వాహనాలకు మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత వాహనానికి రికార్డులు సరిగ్గా ఉండాలి. అర్హులైనవారు ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. ధరఖాస్తు చేసుకునే సమయానికి వాహనం లబ్ధిదారుడి పేరుపైనే ఉండాలి. ధరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఆటో, టాక్సీ డ్రైవర్ల ఖాతాలో ఈ నెల చివర్లో డబ్బు జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. గ్రామ, వార్డ్ వాలంటీర్లు రశీదులను ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు అందిస్తారని తెలుస్తుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: